చాణక్య నీతి: ఈ పది లక్షణాలు మీలో ఉన్నాయా? అయితే జీవితంలో ఎప్పుడూ విజయమే... లేదంటే మోసపోతారు జాగ్రత్త!

ABN , First Publish Date - 2021-10-10T12:33:04+05:30 IST

చాణక్యుని నీతి వాక్యాలు... మనిషి తన జీవితంలో ...

చాణక్య నీతి: ఈ పది లక్షణాలు మీలో ఉన్నాయా? అయితే జీవితంలో ఎప్పుడూ విజయమే... లేదంటే మోసపోతారు జాగ్రత్త!

చాణక్యుని నీతి వాక్యాలు... మనిషి తన జీవితంలో మెరుగైన పని చేసేందుకు ప్రేరణ కల్పిస్తాయి. భారతదేశంలోని ఉత్తమ పండితులలో ఒకరిగా చాణక్య పేరొందారు. చాణక్యకు అర్థశాస్త్రంతో పాటు అనేక ఇతర విషయాలపై లోతైన పరిజ్ఞానం ఉంది. చాణక్యుని నీతి బోధనలు ఈనాటికీ ఆచరణయోగ్యంగా ఉన్నాయి. చాణక్యుడు చెప్పిన ఈ పది అంశాలలో జీవిత విజయ రహస్యం దాగి ఉంది. అవేమిటో, వాటిని ఎందుకు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం. 


ఆయుధాలున్నవారి దగ్గర ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండండి: ఆయుధాలు కలిగివున్న వ్యక్తి దగ్గర ఎవరైనాసరే ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలని చాణక్య నీతి చెబుతోంది. అలాంటివారు కొన్నిసార్లు కోపంతో ఆ ఆయుధాలను ఉపయోగించవచ్చు. ఫలితంగా చుట్టుపక్కల ఉన్నవారు బాధపడాల్సి వస్తుంది.

పొడవైన గోర్లు ఉన్నవారికి దూరంగా ఉండండి: పొడవైన గోర్లు ఉన్నవారికి ఎప్పుడైనాసరే తగినంత దూరంలో ఉండాలని చాణక్య నీతి చెబుతోంది. ఎందుకంటే వారు ఏ క్షణంలోనైనా దాడి చేయవచ్చు. లేదా హాని కలిగించవచ్చు.

కోపం: చాణక్య నీతి ప్రకారం కోపం అనేది మనిషిలోని ప్రతిభను నాశనం చేస్తుంది. అందుకే కోపానికి దూరంగా ఉండాలి. కోపంతో ఉన్నమనిషి మంచి, చెడుల మధ్య వ్యత్యాసాన్ని మరచిపోతాడు.


అహంకారం: చాణక్య నీతి ప్రకారం అహంకారం అనేది మనిషికిగల అతి పెద్ద శత్రువు. అహంకారం కలిగిన వ్యక్తికి గౌరవం లభించదు. సన్నిహితులు కూడా అతనికి దూరంగా మెలుగుతారు.

అత్యాశ: చాణక్య నీతి మనిషి అత్యాశతో ఉండకూడదని చెప్పింది. అత్యాశగల వ్యక్తి ఎప్పుడూ సంతృప్తి చెందలేడు. ఫలితంగా అతని మనస్సు కలతతో నిండిపోతుంది.

క్రమశిక్షణ: చాణక్య నీతి క్రమశిక్షణకుగల ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. విజయం సాధించాలంటే ముందుగా క్రమశిక్షణకు గల ప్రాముఖ్యతను తెలుసుకోవాలి. క్రమశిక్షణ అనేది మనిషికి సమయ ప్రాధాన్యతను కూడా తెలియజేస్తుంది.


సోమరితనం(బద్ధకం): చాణక్యుడు చెప్పిన ప్రకారం సోమరితనాన్ని విడిచిపెట్టకుండా జీవితంలో ఎవరూ విజయం సాధించలేరు. అందుకే సోమరితనానికి దూరంగా ఉండాలి. సోమరితనం మనిషి సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది.

అబద్ధాలు: విజయం సాధించడానికి అబద్ధాలను ఆశ్రయించరాదని చాణక్య నీతి చెబుతోంది. అబద్ధాలు చెప్పే వారికి సమాజంలో గౌరవం లభించదు.

కృషి: ఎల్లప్పుడూ కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తికి లక్ష్యం, విజయం ఎంతో దూరంలో ఉండవని చాణక్య నీతి చెబుతోంది.

మోసం: చాణక్య నీతి సూత్రాల ప్రకారం ఎవరూ మోసం చేయకూడదు. మోసం మనిషికుండే దురలవాట్లలో ఒకటి. మోసం చేసే వ్యక్తులు ఆ తరువాత పలు ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది.

Updated Date - 2021-10-10T12:33:04+05:30 IST