1టీబీ ఎస్‌డీకార్డ్‌

ABN , First Publish Date - 2020-05-30T05:30:00+05:30 IST

మెమొరీ కార్డులు, యూఎ‌స్‌బీ డ్రైవ్‌లు, వైర్‌లెస్‌ ఛార్జర్‌లు, పోర్టబుల్‌ ఎక్స్‌టర్నల్‌ డ్రైవ్స్‌... ఇవన్నీ ఇండియాలో తయారవుతాయా? అంటే

1టీబీ ఎస్‌డీకార్డ్‌

  • తయారుచేసింది మనవాళ్లే!


మెమొరీ కార్డులు, యూఎ‌స్‌బీ డ్రైవ్‌లు, వైర్‌లెస్‌ ఛార్జర్‌లు, పోర్టబుల్‌ ఎక్స్‌టర్నల్‌ డ్రైవ్స్‌... ఇవన్నీ ఇండియాలో తయారవుతాయా? అంటే అవుననే చెప్పాలి. గ్యాడ్జెట్స్‌ పేరెత్తితే చైనా, తైవాన్‌ పేర్లు గుర్తొస్తాయి కానీ డేటా స్టోరేజ్‌ గ్యాడ్జెట్‌లను మనదేశంలోనూ తయారుచేస్తున్నారు. బెంగళూరులోని సాన్‌డి్‌స్క కేంద్రంలో ఇటీవలే 1 టీబీ స్టోరేజ్‌ ఎస్‌డీ కార్డును రూపొందించారు. 


 డేటా స్టోరేజ్‌ ప్రోడక్ట్‌ల ఉత్పత్తిలో సాన్‌డి్‌స్క అగ్రస్థానంలో ఉంది. ఈ కంపెనీకి బెంగళూరులోనూ కేంద్రం ఉంది. ఇక్కడ పనిచేస్తున్న మన ఇంజనీర్లు కొత్త స్టోరేజ్‌ గ్యాడ్జెట్లను తయారుచేస్తూ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఇటీవలే ఇక్కడ మొట్టమొదటి 1 టిబి మైక్రో ఎస్‌డీకార్డు, వైర్‌లెస్‌ ఛార్జర్‌ కమ్‌ బ్యాకప్‌ డివైజ్‌ తయారయ్యాయి. 32 జీబీ ఎస్‌డికార్డులు వచ్చినప్పుడు వినియోగదారులు ఆశ్చర్యపోయారు. కానీ ఆ తరువాత 64, 128, 256, 512 జీబీ సామర్థ్యం ఉన్న ఎస్‌డీకార్డులు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పుడు 1 టీబీ ఎస్‌డీకార్డు సిద్ధమయింది. అదీ మనదేశంలో తయారు కావడం గర్వకారణం.


‘‘2013లో మేము సాన్‌డి్‌స్కలో చేరినప్పుడు 64 జీబీ  మైక్రోఎ్‌సడీకార్డు మాత్రమే ఉంది. అదే అత్యధిక స్టోరేజీ కలిగిన కార్డు. అప్పుడు మేము 128 జీబీ తయారుచేయాలనుకున్నాం. వినియోగదారులు అంత జీబీ  ఉన్న కార్డు ఎవరు కొంటారని అన్నారు. కానీ మేము తయారుచేశాం, మార్కెట్లో అమ్మకాలు బాగా జరిగాయి’’ అని సాన్‌డి్‌స్క బెంగళూరు సెంటర్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ గురుస్వామి గణేష్‌ అన్నారు. చేతి బొటనవేలు సైజు కూడా లేని ఒక గ్యాడ్జెట్‌లో 


1 టీబీ డేటాను స్టోర్‌ చేయడం టెక్నాలజీ అద్భుతం అని చెప్పుకోవచ్చు. ‘‘ఒక చిన్న కార్డులో 1 టీబీ మెమొరీ భద్రపరుచుకోవచ్చు. అంతేకాకుండా ఇది ఫోన్‌ వేగంపై ఏ మాత్రం ప్రభావ చూపదు’’ అని గణేష్‌ వివరించారు.


టెరాబైట్‌ కార్డు తయారీలో ఎన్నో సవాళ్లు ఎదురైనా, వాటన్నింటిని కలిసికట్టుగా ఎదుర్కొన్నారు. సాన్‌డి్‌స్క బెంగళూరు కేంద్రంలో సుమారు 2700 మంది ఇంజనీర్లు పనిచేస్తున్నారు. ‘‘1 టీబీ ఎస్‌డీకార్డు తయారుచేయడం మాకు ఓ ఛాలెంజింగ్‌గా అనిపించింది. ఇంతకుముందెప్పుడూ మేము అది తయారుచేయలేదు. ఎలాంటి ప్రతికూలతలు ఎదురవుతాయో కూడా మాకు తెలియదు. అయినా అంతా కలిసికట్టుగా శ్రమించి సాధించాం’’ అని సిస్టమ్‌ డిజైన్‌ ఇంజనీర్‌గా పనిచేస్తోన్న నరేంద్రియన్‌ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఆయన ఈ ఎస్‌డీకార్డు తయారీలో కీలకపాత్ర పోషించారు. ఈ కేంద్రంలోనే వైర్‌లెస్‌ ఛార్జర్‌ కమ్‌ బ్యాకప్‌ డివైజ్‌ను తయారుచేశారు. ఈ డివైజ్‌ సహాయంతో ఫోన్‌ ఛార్జింగ్‌ మాత్రమే కాకుండా, ఆటోమెటిక్‌గా ఫోన్‌ డేటా బ్యాకప్‌ అవుతుంది.


‘‘ఇప్పటి వరకు హార్డ్‌వేర్‌ రంగంలో చైనానే పైచేయి సాధిస్తోంది. అయితే మన ఇంజనీర్లు రూపొందించిన గ్యాడ్జెట్లు చూస్తే ఇక్కడ కూడా సాధించగలమని అర్థమవుతోంది. ప్రధాన కేంద్రం నుంచి మాకు పూర్తి సహకారం అందుతోంది’’ అని వెస్ట్రన్‌ డిజిటల్‌ ఇండియా కంట్రీ మేనేజర్‌ సుప్రియ అన్నారు. ప్రస్తుతం నరేంద్రియన్‌ టీమ్‌ 2 టీబీ ఎస్‌డీకార్డు తయారీపై దృష్టి సారించింది.

Updated Date - 2020-05-30T05:30:00+05:30 IST