నిరసనకారులపైకి దూసుకెళ్లిన కారు.. అమెరికాలో మహిళ మృతి

ABN , First Publish Date - 2021-06-15T05:32:35+05:30 IST

ఒక నల్లజాతీయుడిని పోలీసులు కాల్చి చంపిన ఘటనకు నిరసన తెలుపుతున్న వారిపైకి కారుతో దూసుకెళ్లాడో దుండగుడు.

నిరసనకారులపైకి దూసుకెళ్లిన కారు.. అమెరికాలో మహిళ మృతి

మినియాపోలిస్: ఒక నల్లజాతీయుడిని పోలీసులు కాల్చి చంపిన ఘటనకు నిరసన తెలుపుతున్న వారిపైకి కారుతో దూసుకెళ్లాడో దుండగుడు. ఈ ఘటనలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఈ దుర్ఘటన అమెరికాలోని మినియాపోలిస్‌లో జరిగింది. ఇక్కడ ఒక నల్లజాతీయుడిని పోలీసులు కొన్ని రోజుల క్రితం యూఎస్ మార్షల్స్ కాల్చి చంపారు. దీనికి స్థానికులు నిరసన తెలుపుతుండగా ఈ ఘటన జరిగింది. కారు ప్రమాదం జరగిన తర్వాత కారు ఆగగానే నిరసనకారులు డ్రైవర్‌ను బయటకులాగి చితకబాదారట. దీంతో గాయపడిన అతన్ని ఆస్పత్రికి తరలించారు. అలాగే అతను కారుతో ఢీకొట్టిన మహిళ విషమ పరిస్థితుల్లో ఉండగా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే ఆమె చికిత్స పొందుతూ మరణించింది. ఆ డ్రైవర్ డ్రగ్స్, మద్యం తీసుకొని ఉన్నాడని, ఆ మత్తులోనే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.

Updated Date - 2021-06-15T05:32:35+05:30 IST