Viral Video: వ్యాపారి ఇంట్లో ఐటీ అధికారుల సోదాలు.. లెక్క తేల్చేందుకు ఐరన్ బాక్స్, హెయిర్ డ్రయ్యర్‌లతో..

ABN , First Publish Date - 2022-01-10T18:01:38+05:30 IST

ఐటీ అధికారులకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఓ వ్యాపారి ఇంట్లో సోదాలు చేసుకుందు వెళ్లిన అధికారులు.. అక్కడ ఐరన్ బాక్సులు, హెయిర్ డ్రయ్యర్‌లతో వాళ్లు చేసిన పని చూసి నెటిజన్లు షాకవతున్నారు.

Viral Video: వ్యాపారి ఇంట్లో ఐటీ అధికారుల సోదాలు.. లెక్క తేల్చేందుకు ఐరన్ బాక్స్, హెయిర్ డ్రయ్యర్‌లతో..

ఇంటర్నెట్ డెస్క్: ఐటీ అధికారులకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఓ వ్యాపారి ఇంట్లో సోదాలు చేసుకుందు వెళ్లిన అధికారులు.. అక్కడ ఐరన్ బాక్సులు, హెయిర్ డ్రయ్యర్‌లతో వాళ్లు చేసిన పని చూసి నెటిజన్లు షాకవతున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


భోపాల్‌లోని లిక్కర్ వ్యాపారి శంకర్ రాయ్ ఇంటిపై శుక్రవారం రోజు ఐటీ అధికారులు సోదాలు జరిపారు. ఇంట్లోని ప్రతిమూలను క్షుణ్ణంగా పరిశీలించిన అధికారులు.. వాటర్ ట్యాంక్‌లో ఓ బ్యాగును కనుగొన్నారు. అనంతరం దాన్ని బయటకు తీశారు. అందులో భారీ మొత్తంలో నోట్ల కట్టలు ఉండటంతో కంగుతిన్నారు. ఆ తర్వాత డబ్బును లెక్కపెట్టడం కోసం ఐరన్ బాక్సులు, హెయిర్ డ్రయ్యర్‌లను ఉపయోగించి నోట్లను వేడి చేశారు. ఈ క్రమంలోనే బ్యాగులో కోటి రూపాయల డబ్బు ఉన్నట్టు అధికారుల గుర్తించారు. కాగా.. ఐరన్ బాక్సులు, హెయిర్ డ్రయ్యర్‌లతో నోట్లను వేడి చేస్తున్న దృశ్యాలను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసి నెటిజన్లు షాకవుతున్నారు. ఇదిలా ఉంటే.. అధికారులు రూ.8కోట్ల నగదు, 3కిలోల బంగారాన్ని వ్యాపారి ఇంట్లో నుంచి స్వాధీనం చేసుకున్నారు. 






Updated Date - 2022-01-10T18:01:38+05:30 IST