Bhogeshwara: 70 ఏళ్ల వయసున్న ఏనుగు మృతి.. ఆ ఏనుగు ప్రత్యేకత ఏంటంటే..

ABN , First Publish Date - 2022-06-14T22:37:21+05:30 IST

ఆ ఏనుగు వయస్సు 70 ఏళ్లు.. పేరు భోగేశ్వర.. కొందరు ముద్దుగా మిస్టర్ కబిని అని కూడా పిలుస్తారు..

Bhogeshwara: 70 ఏళ్ల వయసున్న ఏనుగు మృతి.. ఆ ఏనుగు ప్రత్యేకత ఏంటంటే..

ఆ ఏనుగు వయస్సు 70 ఏళ్లు.. పేరు భోగేశ్వర.. కొందరు ముద్దుగా మిస్టర్ కబిని అని కూడా పిలుస్తారు.. ఆసియాలోనే అత్యంత పొడవైన దంతాల కలిగిన ఏనుగుగా భోగేశ్వర గుర్తింపు సంపాదించింది.. కర్ణాటకలోని బందీపూర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో ఉండే భోగేశ్వర తన పొడవైన దంతాలతో పర్యాటకులను విశేషంగా ఆకర్షించేది.. ఈ నెల 11న భోగేశ్వర అనారోగ్యంతో మృతి చెందడం వన్యప్రాణి ప్రేమికులను విపరీతంగా కలిచి వేస్తోంది. 


ఇది కూడా చదవండి..

ఏనుగులు కూడా పగబడతాయా..? ఓ మహిళను చంపి.. వెతుక్కుంటూ ఊళ్లోకి వచ్చి మరీ ఆమె ఇంటిని కూల్చి..


ఈ ఏనుగు దంతాల్లో ఒకటి 8 అడుగులు పొడవు, మరొకటి 7.5 అడుగుల పొడవు ఉంటాయి. రెండు దంతాలు దాదాపుగా నేలను తాకే విధంగా ఉండేవి. రిజర్వ్ ఫారెస్ట్‌లోని భోగేశ్వర్ శిబిరం సమీపంలో దేవాలయం దగ్గర ఆ ఏనుగు తరచుగా కనిపిస్తుండేది. దాంతో అటవీ శాఖ సిబ్బంది దానికి భోగేశ్వర అని పేరు పెట్టారు. 70 ఏళ్ల వయసు కలిగిన ఆ ఏనుగుకు చాలా మంది నెటిజన్లు సోషల్ మీడియా ద్వారా నివాళులర్పిస్తున్నారు. ఎగ్జిబిషన్ సెంటర్‌లో ఏనుగు దంతాలను భద్రపరచాలని అటవీశాఖ యోచిస్తోంది.



Updated Date - 2022-06-14T22:37:21+05:30 IST