Parliament : సమావేశాల నుంచి పది మంది Congress సభ్యుల సస్పెన్షన్!

ABN , First Publish Date - 2021-07-28T21:56:55+05:30 IST

సభా కార్యకలాపాలను అడ్డుకోవడంతో పాటు, పేపర్లను చింపేసి స్పీకర్‌ వైపు విసిరేసిన కాంగ్రెస్ సభ్యులపై

Parliament : సమావేశాల నుంచి పది మంది Congress సభ్యుల సస్పెన్షన్!

న్యూఢిల్లీ : సభా కార్యకలాపాలను అడ్డుకోవడంతో పాటు, పేపర్లను చింపేసి స్పీకర్‌ వైపు విసిరేసిన కాంగ్రెస్ సభ్యులపై స్పీకర్ ఓంబిర్లా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వారందర్నీ సస్పెండ్ చేసేందుకు నోటీసులు జారీ చేశారు. వర్షాకాల సమావేశాలకు మొత్తానికీ సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. విపక్ష సభ్యులెవరైనా... సభలో ఇలాంటి క్రమశిక్షణా రాహిత్యాలకు పాల్పడితే, వారిని కూడా సస్పెండ్ చేస్తామని స్పీకర్ తీవ్రంగా హెచ్చరించారు. సస్పెండ్ చేసిన ఎంపీల జాబితాలో... మాణిక్కం ఠాగూర్, డీన్ కురియకోసే, హిబీఈడెన్, ఎస్. జ్యోయిమణి, రవ్‌నీత్ బిట్టు, గుర్జీత్ అవుజా, టీఎన్ ప్రతాపన్, వైతిలింగమ్, సప్తగిరి శంకర్, ఏఎమ్ ఆరిఫ్, దీపక్ బైజ్... వీరందర్నీ సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా పేర్కొన్నారు. పెగాసస్ వ్యవహారంతో పాటు ఇతర వ్యవహారాలపై ప్రతిపక్ష పార్టీలు ఉదయం నుంచి సభలో నిరసనకు దిగారు. దీంతో మూడు సార్లు సభ వాయిదా పడింది. 


Updated Date - 2021-07-28T21:56:55+05:30 IST