జిల్లాలో కొవిడ్‌ కాల్‌ సెంటర్‌

ABN , First Publish Date - 2022-01-19T05:58:48+05:30 IST

జిల్లాలో కరోనా విజృంభిస్తున్న నేపఽథ్యంలో ప్రజల సౌకర్యార్థం స్థానిక ఆస్పత్రుల్లో అందుబాటులో ఉన్న బెడ్స్‌, మందులు, ఇతర వైద్య సేవల వివరాలను తెలుసుకోవడానికి 24 గంటల ప్రత్యేక కొవిడ్‌ కాల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి తెలిపారు.

జిల్లాలో కొవిడ్‌ కాల్‌ సెంటర్‌
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

సిరిసిల్ల కలెక్టరేట్‌, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కరోనా విజృంభిస్తున్న నేపఽథ్యంలో ప్రజల సౌకర్యార్థం స్థానిక ఆస్పత్రుల్లో అందుబాటులో ఉన్న బెడ్స్‌, మందులు, ఇతర వైద్య సేవల వివరాలను తెలుసుకోవడానికి 24 గంటల ప్రత్యేక కొవిడ్‌ కాల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి తెలిపారు. సిరిసిల్ల సమీకృత కలెక్టరేట్‌లో మంగళవారం  సంబంధిత అధికారులతో కొవిడ్‌ నివారణపై  సమీక్షించారు. కాల్‌ సెంటర్‌  నిర్వహణ తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కొవిడ్‌కు సంబంధించిన పూర్తి వివరాలతో పాటు అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్‌ సేవల కోసం కాల్‌ సెంటర్‌ను సంప్రదించాలన్నారు. కాల్‌ సెంటర్‌ సిబ్బంది వెంటనే స్పందించి సరైన సమాధానం ఇవ్వాలన్నారు. ఆస్పత్రుల్లో బెడ్స్‌, మందులు, ఆక్సిజన్‌ వంటి వాటిపై  నివేదికలు తీసుకోని సిద్ధంగా ఉంచాలన్నారు. ప్రత్యేక రిజిస్టర్‌ కేటాయించాలని, కాల్‌ సెంటర్‌ను సంప్రదించే వారి వివరాలను క్లుప్తంగా నమోదు చేయాలని అన్నారు. షిఫ్ట్‌ల వారీగా సిబ్బంది విధులు నిర్వహించాలని సూచించారు. కాల్‌ సెంటర్‌ను సంప్రదించిన వారికి పూర్తి సమాచారం అందించాలన్నారు. ప్రజలు సమాచారం కోసం 6309141122, 9121842941, 7396553254 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. జిల్లాలోని ఆసత్రురల్లో అందుబాటులో ఉన్న ఆక్సిజన్‌ సిలిండర్ల వివరాలను సేకరించడంతోపాటు ఏ ఆస్పత్రుల్లో ఎంతమేరకు వినియోగిస్తున్నారనే వివరాలను రెవెన్యూ సిబ్బంది సేకరించాలన్నారు. సేకరించిన వివరాలను కలెక్టరేట్‌ ఏవో గంగయ్యకు అందించాలన్నారు. వేములవాడ ఆలయానికి వచ్చే భక్తులు కొవిడ్‌ నిబంధనలు పాటించేలా సిబ్బంది పర్యవేక్షించాలన్నారు.  ఆలయ పరిసరాల్లో శానిటైజ్‌ చేసుకోవడానికి పాయింట్‌లను ఏర్పాటు చేయాలని సూచించారు. ఎవరికైనా లక్షణాలు కనిపిస్తే ముందుగా నిర్ధారణ పరీక్షలు చేసుకునేలా సిబ్బంది సూచించాలన్నారు.  సమావేశంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ సుమన్‌మోహన్‌రావు, వేములవాడ ఆలయ ఈవో రమాదేవి, సర్వేలెన్స్‌ అధికారి డాక్టర్‌ మీనాక్షి  తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-01-19T05:58:48+05:30 IST