దర్జాగా మొరం దందా!

ABN , First Publish Date - 2021-12-05T05:36:18+05:30 IST

దర్జాగా మొరం దందా!

దర్జాగా మొరం దందా!
పొక్లెయినర్‌, జేసీబీని సీజ్‌ చేస్తున్న అధికారులు

అభివృద్ధి పనుల పేరుతో పక్కదారి
ప్రభుత్వ భూముల్లోనూ తవ్వకాలు
రాత్రివేళల్లో యథేచ్చగా రవాణా
జరిమానాలతో సరిపెడుతున్న అధికారులు

నిజామాబాద్‌ రూరల్‌, డిసెంబరు 4: ప్రభుత్వం చేపడు తున్న అభివృద్ధి పనుల కోసం మొరం తవ్వకాలకు అనుమతి పొందిన కొందరు అడ్డుదారుల్లో అ మ్ముకుంటున్నారు. నిజామాబాద్‌ రూరల్‌ మండలం గుండారం, మల్లారం, గాంధీనగర్‌, రాంనగర్‌, మల్కాపూర్‌ (ఎ), జలాల్‌పూర్‌, పాల్దాతోపాటు సారంగాపూర్‌, ఖానాపూ ర్‌ తదితర గ్రామ శివార్లలోంచి వేబిల్లులు లేకుండానే మొరం, మట్టిని యథేచ్ఛగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఒకే వేబిల్లుపై అనేక టిప్పర్లు నడుపుతున్నారు. రెవెన్యూ, మైనింగ్‌ అధికారులు వాహనాలు తనిఖీ చేసినప్పుడు సంబంధింత వాహనం వేబిల్లులు చూపడం లేదు. తర్వాత రోజు ఆ టిప్పర్లకు సంబంధించిన వే బిల్లులు సృష్టిస్తూ జరిమానా నుంచి తప్పించుకుంటున్నారు. ఇటీవలే సారంగపూర్‌ నుంచి వస్తున్న నాలుగు టిప్పర్‌ల మైనింగ్‌, రెవెన్యూ అధికారులు పట్టుకుని వేబిల్లులు లేకపోవడంతో రూ.10వేల చొప్పున జరిమానాలు విధించారు. జరిమానా కట్ట షరామామూలుగానే మొరం అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు.
ప్రభుత్వ భూమిలో మొరం తవ్వకం..
సారంగపూర్‌లోని సర్వేనెంబర్‌ 58లో అనుమతి లేకుండా పొక్లెయిన్‌లు, జేసీబీలతో మొరం తవ్వకాలు చేపడుతున్నారు. జిల్లా జైలు పక్కనున్న స్థలంలో మొరం తవ్వి బయట విక్రయిస్తున్నారు. విషయాన్ని స్థానికులు మైనింగ్‌, రెవెన్యూ అధికారుల దృష్టికి తెచ్చారు. శుక్రవారం మైనింగ్‌ ఏడీ సత్యనారాయణతోపాటు రూరల్‌ తహసీల్దార్‌ ప్రశాంత్‌, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ భూపతిప్రభు సదరు స్థలానికి వెళ్లి విచారణ చేపట్టగా అక్రమ మొరం తవ్వకం విష యం వెలుగులోకి వచ్చింది. పొక్లెయిన్‌, జేఏసీబీని సీజ్‌ చేసి అక్రమానికి పాల్పడిన నజీమ్‌ మహ్మద్‌ అనే వ్యక్తిపై కేసు నమోదు చేశారు. వాహనాలను రూరల్‌ పోలీసు స్టేషన్‌కు తరలించారు. సారంగపూర్‌ చెరువులోంచి మొరం తరలిస్తున్న టాక్టర్‌ను రెవెన్యూ అధికారులు సీజ్‌ చేశారు.
కెనాల్‌ బౌండరీలోంచి మట్టి తరలింపు..
మండలంలోని ముత్తకుంట గ్రామానికి చెందిన కొందరు నిజాంసాగర్‌ కెనాల్‌ పక్కనుంచి స్థలంలో తవ్వకాలు సాగించారు. జేసీబీల సహాయంతో పెద్ద ఎత్తున మట్టిని తవ్వి తరలించారు. కొందరు స్థానికులు రెవెన్యూ, మైనింగ్‌ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అఽధికారులు తవ్వకాలు ఆపాలని సూచించారు. ఇరిగేషన్‌ స్థలాల్లో సైతం అక్రమార్కులు అక్రమ రవాణాకు పాల్పడుతున్నారు.
రాత్రుల్లో అడ్డగోలుగా రవాణా..
నిజామాబాద్‌ రూరల్‌ మండలంలోని గుండారం, మల్కాపూర్‌(ఎ), జలాల్‌పూర్‌లలో అర్ధరాత్రి సమయంలో మొరం, మట్టి తవ్వకాలు చేపడుతున్నారు. గ్రామస్థులు, వీ ఆర్‌ఏలకు తెలియకుండా రాత్రి 12 గంటల నుంచి ఉద యం 4 గంటల వరకు రహస్యంగా తవ్వకాలు సాగిస్తున్నా రు. మల్కాపూర్‌, గుండారం, జలాల్‌పూర్‌ గ్రామాల్లో ఇటీవ ల పదుల సంఖ్యలో కొత్త రైస్‌మిల్లులు నిర్మానం జరుగుతోంది. వాటితోపాటు ముబారక్‌నగర్‌, సారంగపూర్‌లలో కొ త్త కొత్త వెంచర్లు చేస్తున్నారు. వారికి వేల టిప్పర్ల మొరం, మట్టిఅవసరం అవుతున్నాయి. వాటిని కొందరు సొమ్ము చేసుకుంటున్నారు. ఎవరికీ తెలియకుండా ఉదయం సమయంలో కాకుండా కేవలం అర్ధరాత్రి సమయంలో మొరం, మట్టి తవ్వకాలు జేసీబీతో చేపట్టి వాటిని సమయం దొరికినప్పుడల్లా టిప్పర్లు ద్వారా తరలిస్తున్నారు. వ్యవసాయ పనులు ఉండటంతో ట్రాక్టర్లు అందుబాటులో ఉండటం లేదు. దీంతో టిప్పర్ల ద్వారా రైస్‌మిల్లులు, అపార్టుమెంట్లు, వెంచర్‌లలో మొరం, మట్టిని సరఫరా చేస్తున్నారు.
అనుమతులు తప్పనిసరి..
- ప్రశాంత్‌, తహసీల్దార్‌

మొరం, మట్టి, ఇసుకను అక్రమంగా రవాణాచేయడం నేరం. రెవెన్యూ, మైనింగ్‌ అధికారులకు తెలియకుండా అక్రమంగా తరలిస్తే వాహనాలు సీజ్‌చేస్తాం, మెటీరియల్‌కు సరిపడా జరిమానా విధిస్తాం. మొరం దేనికోసం తీసుకుంటున్నారో అదే పనికి వినియోగించాలి తప్ప అమ్మకాలు చేయవద్దు. కలెక్టర్‌ ఆదేశాలతో స్పెషనల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నాం.  

Updated Date - 2021-12-05T05:36:18+05:30 IST