పాఠశాలల్లో బతుకమ్మ సంబురాలు

ABN , First Publish Date - 2022-09-25T05:55:11+05:30 IST

పాఠశాలల్లో బతుకమ్మ సంబురాలు

పాఠశాలల్లో బతుకమ్మ సంబురాలు
ఘట్‌కేసర్‌ : హోలీ ఫెయిత్‌ హైస్కూల్‌లో బతుకమ్మ సంబురాల్లో విద్యార్థులు

వికారాబాద్‌/తాండూరు/కులకచర్ల/కొడంగల్‌/బొంరా్‌సపేట్‌/దౌల్తాబాద్‌/దోమ, సెప్టెంబర్‌ 24 : మేడ్చల్‌-మల్కాజిగిరి, వికారాబాద్‌ జిల్లాల్లోని పలు పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు బతుకమ్మ సంబురాలు జరుపుకున్నారు. వికారాబాద్‌లోని భృంగీ పాఠశాల డైరెక్టర్‌ కుమారస్వామి, ప్రిన్సిపాల్‌ రమాదేవిల ఆధ్వర్యంలో శనివారం పాఠశాలలో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు. వారు మాట్లాడుతూ బతుకునిచ్చే పండుగ బతుకమ్మ అని తెలంగాణ మహిళలందరూ ఒక్క వద్దకు చేరుకుని చేసుకుని అందమైన పండుగ అన్నారు. టీచర్లు సుమలత, టీచర్లు, సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు. అదేవిధంగా తాండూరు పట్టణంలోని వేదిక్‌ విశిష్ట స్కూల్‌లో యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు. భారీ బతుకమ్మను తయారు చేసి ఆట పాటలతో విద్యార్థులు సంబరాలు జరుపుకున్నారు. 

తాండూరు మండలం సంగెంకలాన్‌ ప్రాథమికోన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆట పాటలతో బతుకమ్మ ఆడారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ధారూరులోని శ్రీ చైతన్య పాఠశాలలో బతుకమ్మ సంబురాలు నిర్వహించారు. కరస్పాండెంట్‌ మధు, డైరెక్టర్‌ రాజు, టీచర్లు పాల్గొన్నారు.  కులకచర్ల బాలికల ఉన్నత పాఠశాల, కేజీబీవీ విద్యాలయం, ముజాహిత్‌పూర్‌ ఆదర్శ పాఠశాల, బండవెల్కిచర్ల న్యూ రవీంద్రభారతి, రాంపూర్‌, తిర్మలాపూర్‌ పాఠశాలల్లో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. అనంతరం సమీప చెరువుల్లో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. పాఠశాలల హెచ్‌ఎంలు, టీచర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. కొడంగల్‌ పట్టణంలోని నవీన ఆదర్శ కాన్వెంట్‌, కృష్ణవేణి టాలెంట్‌, బొంరా్‌సపేట్‌ మండల కేంద్రంలోని జడ్పీహెచ్‌ఎస్‌, దౌల్తాబాద్‌ మండల పరిధిలోని గోకఫస్లాబాద్‌ న్యూ మాస్టర్‌ మైండ్స్‌ పాఠశాల,  కొడంగల్‌ మండల పరిధిలోని అంగడిరైచూర్‌ జడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు బతుకమ్మ సంబరాలను జరుపుకున్నారు.

దోమ మండల కేంద్రంతో పాటు మల్లెపల్లి ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులు రంగురంగుల పూలతో బతుకమ్మలను తయారుచేశారు. పాఠశాలల ప్రిన్సిపాళ్లు, ప్రధానోపాధ్యాయులు నరేశ్‌రాజ్‌, మక్సూద్‌అలీ, బసంత్‌రెడ్డి, వెంకటప్ప, స్వాతి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. 

  • మేడ్చల్‌-మల్కాజిగిరి పరిధిలో..

ఘట్‌కేసర్‌/శామీర్‌పేట/ఘట్‌కేసర్‌ రూరల్‌: ఘట్‌కేసర్‌, పోచారం మున్సిపాలిటీల పరిధిలోని పలు పాఠశాలల్లో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థినులు చీరలు కట్టుకొని బతుకమ్మలు పేర్చి ఆడిపాడారు. అనంతరం బతుకమ్మలను చెరువుల్లో నిమజ్జనం చేశారు. ఉపాధ్యాయలు, విద్యార్థులు పాల్గొన్నారు. శామీర్‌పేట మండల కార్యాలయ ప్రాంగణంలో ఐసీడీఎస్‌ సీడీపీవో ఉదయశ్రీ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను నిర్వహించారు. అంగన్‌వాడీ టీచర్లు పెద్దఎత్తున బతుకమ్మ సంబరాలను నిర్వహించారు. ఎంపీపీ ఎల్లుబాయి, వైస్‌ఎంపీపీ సుజాత, జడ్పీటీసీ అనిత, సర్పంచ్‌ బాలమణి, డాక్టర్‌ సౌజన్యలు పాల్గొన్నారు. జిల్లాలోని కుత్బుల్లాపూర్‌, మూడుచింతలపల్లి, శామీర్‌పేట, కీసర, జవహర్‌నగర్‌, మండలాల అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు, టీచర్లు, 250 మంది కిశోర బాలికలు, పోషన్‌ అభియాన్‌ సిబ్బందితో కలసి బతుకమ్మ సంబరాలను నిర్వహించారు. ఘట్‌కేసర్‌ మండలం అవుషాపూర్‌లోని మెరిట్‌ పాఠశాల, ప్రతా్‌పసింగారం జడ్పీ పాఠశాలలో విద్యార్థినులు బతుకమ్మలు తయారు చేసి, పాఠశాల ఆవరణలో ఆడిపాడారు. మెరిట్‌ పాఠశాల డైరెక్టర్లు పద్మారెడ్డి, బాబుల్‌రెడ్డి, అభినందన్‌రెడ్డి, ప్రిన్సిపాల్‌ పుష్పలత, ప్రతా్‌పసింగారం జడ్పీ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రవికుమార్‌, ఉపాధ్యాయులు, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-09-25T05:55:11+05:30 IST