భవనం పైకప్పు పెచ్చులూడి

ABN , First Publish Date - 2022-08-12T09:32:59+05:30 IST

భవనం పైకప్పు పెచ్చులూడి

భవనం పైకప్పు పెచ్చులూడి

భవనం పైకప్పు పెచ్చులూడి 


బాసర, ఆగస్టు 11: హాస్టల్‌ పైకప్పు పెచ్చులూడి పడడంతో బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థికి గాయాలయ్యాయి. పీయూసీ-1 చదువుతున్న దీమత్‌ అనే విద్యార్థి తరగతులకు వెళ్లేందుకు వసతి గృహంలో రోజూ మాదిరిగానే సిద్ధమవుతున్న సమయంలో.. భవన పైకప్పు నుంచి పెచ్చులూడి తలపై పడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. డైరెక్టర్‌ సతీశ్‌ కుమార్‌ ఆదేశాలతో సిబ్బంది వెంటనే దీమత్‌ను ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచనల మేరకు నవీపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. గాయం పెద్దదిగా ఉండడంతో ఆరు కుట్లు పడ్డాయని తెలిసింది. దీమత్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పీఆర్వో విజయకుమార్‌ తెలిపారు.

Updated Date - 2022-08-12T09:32:59+05:30 IST