లక్ష్మీపూర్‌ లిఫ్ట్‌ ఇరిగేషన్‌పై ఎట్టకేలకు అడుగు ముందుకు

ABN , First Publish Date - 2022-08-12T07:31:08+05:30 IST

గత దశాబ్దకాలంగా ఎదురుచూస్తున్న లక్ష్మీ పూర్‌ లిఫ్ట్‌ ఇరిగేషన్‌పై ఎట్టకేలకు అడుగు ముందుకు పడింది.

లక్ష్మీపూర్‌ లిఫ్ట్‌ ఇరిగేషన్‌పై ఎట్టకేలకు అడుగు ముందుకు

లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ఏర్పాటుకు రాష్ట్ర కేబినెట్‌ ఆమోదం

రూ.49 కోట్లు మంజూరు 

ఖానాపూర్‌, ఆగస్టు 11 గత దశాబ్దకాలంగా ఎదురుచూస్తున్న లక్ష్మీ పూర్‌ లిఫ్ట్‌ ఇరిగేషన్‌పై ఎట్టకేలకు అడుగు ముందుకు పడింది. ఖానా పూర్‌ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్‌ మంత్రాంగం ఫలించింది. తెలం గాణ రాష్ట్ర కేబినెట్‌ గురువారం సాయంత్రం లక్ష్మీపూర్‌ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. లక్ష్మీపూర్‌ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ఏర్పాటు కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.49 కోట్లను మంజూరు చేసినట్లు ఖానా పూర్‌ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్‌ తెలిపారు. పాండ్వాపూర్‌ బ్రిడ్జి సమీ పంలో ఏర్పాటు చేయనున్న లక్ష్మీపూర్‌ లిఫ్ట్‌ ఇరిగేషన్‌తో పాండ్వాపూర్‌, అకొండపేట, కల్లెడ, లక్ష్మీపూర్‌, దోస్త్‌నగర్‌ ఐదు గ్రామాల్లో 8 చెరువులను నింపేందుకు ఈ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ఉపయోగపడుతుందన్నారు. సుమారు 3100 ఎకరాలకు సాగునీటిని అందించే ఈ లిఫ్ట్‌ ఇరిగేషన్‌తో కడెం పరి సర ప్రాంతాలు మరింత సస్యశ్యామలమవుతాయని ఎమ్మెల్యే రేఖా నాయక్‌ తెలిపారు. లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ఏర్పాటు చేసే ప్రాంతంలో ఏడాదిలో 365 రోజుల పాటు నిరంతరం నీరు నిల్వ ఉంటుందన్నారు. తన నియో జకవర్గంలోని ఐదు గ్రామాల్లో ఎనిమిది చెరువులు నింపేందుకు, రైతుల సాగు నీటి సమస్యల పరిష్కారం కోసం లక్ష్మీపూర్‌ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ఏర్పాటు చేయాలని తాను కోరడంతో స్పందించిన ముఖ్యమంత్రి కేసీ ఆర్‌కు, అందుకు సహకరించిన జిల్లా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి ధన్య వాదాలు చెబుతున్నట్లు ఎమ్మెల్యే రేఖానాయక్‌ పేర్కొన్నారు. 


Updated Date - 2022-08-12T07:31:08+05:30 IST