వరల్డ్ చాంప్ కార్ల్‌సన్‌కు ప్రజ్ఞానంద మళ్లీ షాక్
ABN , First Publish Date - 2022-05-22T09:23:14+05:30 IST
గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద రమేశ్‌బాబు వరల్డ్ చాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్‌కు మరోసారి షాకిచ్చాడు.
న్యూఢిల్లీ: గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద రమేశ్‌బాబు వరల్డ్ చాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్‌కు మరోసారి షాకిచ్చాడు. చెసబుల్ మాస్టర్స్ ఆన్లైన్ ర్యాపిడ్ చెస్ టోర్నీ ఐదో రౌండ్లో కార్ల్‌సన్‌ను ప్రజ్ఞానంద చిత్తు చేశాడు. గేమ్ డ్రా దిశగా సాగుతున్న దశలో..40వ ఎత్తు చివరి క్షణాల్లో కార్ల్సన్ కోలుకోలేని తప్పిదం చేశాడు. దాంతో తదుపరి ఎత్తులో మాగ్నస్ చేతులు ఎత్తేయడంతో ప్రజ్ఞానంద విజేతగా నిలిచాడు. గత ఫిబ్రవరిలో జరిగిన ఎయిర్‌థింగ్స్ మాస్టర్స్ ఆన్లైన్ టోర్నమెంట్ ఎనిమిదో రౌండ్లోనూ నార్వే సూపర్ స్టార్ కార్ల్‌సన్‌పై ప్రజ్ఞానంద గెలుపొందాడు. ఈ విజయంతో కీలకమైన మూడు పాయింట్లు దక్కించుకున్న 16 ఏళ్ల చెన్నై ఆటగాడు మొత్తం 12 పాయింట్లతో నాకౌట్ రేసులో నిలిచాడు. ఆరో రౌండ్లో హరికృష్ణతో గేమ్‌ను డ్రా చేసుకున్న ప్రజ్ఞానంద, తదుపరి జోన్స్‌పై నెగ్గి, 8వ రౌండ్లో డేవిడ్ చేతిలో ఓడాడు.