ప్రొజెక్టర్‌ తయారుచేద్దామా!

ABN , First Publish Date - 2022-06-15T07:47:18+05:30 IST

బ్లాక్‌ మార్కర్‌తో ప్లాస్టిక్‌ రాప్‌పై మీకు నచ్చిన ఆకారాన్ని గీయండి. తరువాత కత్తెరతో కత్తిరించండి.

ప్రొజెక్టర్‌ తయారుచేద్దామా!

కావలసినవి

ఖాళీటిష్యూ పేపర్‌ రోల్‌, ప్లాస్టిక్‌ రాప్‌, కత్తెర, రబ్బరు బ్యాండ్‌, బ్లాక్‌ మార్కర్‌, టార్చ్‌.


ఇలా చేయాలి...

బ్లాక్‌ మార్కర్‌తో ప్లాస్టిక్‌ రాప్‌పై మీకు నచ్చిన ఆకారాన్ని గీయండి. తరువాత కత్తెరతో కత్తిరించండి.

ఆ ప్లాస్టిక్‌ రాప్‌ను పేపర్‌ రోల్‌లో ఒకవైపు పెట్టండి. పడిపోకుండా రబ్బర్‌ బ్యాండు వేయండి.

ఇప్పుడు రోల్‌ను గోడవైపు పెట్టి టార్చిలైట్‌తో వెలుతురు వేయండి. 

గోడపైన మీరు కత్తిరించిన పేపర్‌ రోల్‌ నీడ స్పష్టంగా కనిపిస్తుంది. మీరు తయారుచేసిన రోల్‌ ప్రొజెక్టర్‌లా పనిచేస్తుంది.  

Updated Date - 2022-06-15T07:47:18+05:30 IST