నందమూరీ.. నటనావిహారీ
అందుకొనుమ.. ఇదే మా వందనమ్ము!
శ్రీకృష్ణుడైనా.. స్ర్తీ వేషమైనా
వెంకటేశ్వరుడైనా.. వైవస్వతుండైనా
భరతాగ్రజుండైన.. పౌలస్త్యుడైనా
నీలకంధరుడైన.. నీరజోదరుడైనా
భీమసేనుండైన.. భీష్ముడైనా
ప్రాచేతసుండైన.. ప్రవరాఖ్యుడైనా
రాజరాజైన.. రాకుమారుండైనా
మేఘనాథుడైన.. గాధేయుడైనా
విక్రమార్కుడైన.. దుష్యుంతుడైనా
హరిశ్చంద్రుడైన.. మశ్చీంద్రుడైనా
బ్రహ్మనాయుడైన.. బ్రహృన్నలైనా
బ్రహ్మంగారైనా.. రాయలవారైనా
సాటేవ్వరయ్య నీకు.. నీవు తప్ప
పౌరాణికంబైన.. సాంఘికమైనా
చారిత్రకంబైన.. జానపదమైనా
జనరంజకమేగా!
ఏ పాత్రకైనా ప్రాణప్రతిష్ట
నీ రూపు.. నీ స్వరము
నీ నటనాచాతుర్యుము
అనితరసాధ్యమ్ము
అన్నా. నందమూరీ నీకు
శత సహస్ర వందనమ్ము!!
(వైవస్వతుడు: యుముడు, భరతాగ్రజుడు: రాముడు, శ్వేతవాహనుడు: అర్జునుడు, ప్రాచేతసుండు: వాల్మీకి, నీరజోదరుడు: విష్ణువు, పౌలస్త్యుడు: రావణుడు, నీల కంధరుడు: శివుడు, రాధేయుడు: కర్ణుడు, గాధేయుడు: విశ్వామిత్రుడు, మేఘనాధుడు: ఇంద్రజిత్)అన్నగారి వర్ధంతి సంస్మరణలో ఆయనకు ఇదే నివాళి!!
కొమ్మినేని వెంకటేశ్వరరావు