Advertisement
Advertisement
Abn logo
Advertisement

తహసీల్దార్‌ కార్యాలయంలో కుర్చీలు ఖాళీ!


  ఖాళీగా బదిలీలు, పదోన్నతులపై వెళ్లిన వారి స్థానాలు 

 ఉన్నవారిలో పలువురు సెలవులు

మరికొందరు క్షేత్రస్థాయి పర్యటన 

 వివిధ పనులపై వచ్చిన ప్రజలు నిరాశగా తిరుగుముఖం

నర్సీపట్నం, అక్టోబరు 22 : ఇక్కడి తహసీల్దార్‌ కార్యాలయంలో శుక్రవారం చాలా వరకు కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి. దీంతో మండలంలోని పలు గ్రామాల నుంచి వివిధ పనులపై వచ్చిన ప్రజలు తీవ్ర నిరాశతో వెనుదిరిగారు.  డిప్యూటీ తహసీల్దార్‌ ప్రసాదరావు డిప్యూటేషన్‌పై వెళ్లడంతో సంవత్సర కాలంగా ఆ సీటు ఖాళీగా ఉంది. ఎలక్షన్‌ డీటీ సూర్యనారాయణ పదోన్నతిపై బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో మరొకరిని నియమించ లేదు. జూనియర్‌ అసిస్టెంట్‌, టైపిస్ట్‌ మూడు నెలలు సెలువు పెట్టారు. ఎన్నికల విభాగం టైపిస్ట్‌ పోస్టు కూడా ఖాళీగా ఉంది. శుక్రవారం కార్యాలయంలో సీనియర్‌ అసిస్టెంటు, ఎలక్షన్‌ సీనియర్‌ అసిస్టెంట్‌ ఇద్దరే  ఉన్నారు. తహసీల్దార్‌ జయ, ఆర్‌ఐ కార్యాలయానికి వచ్చి ఫీల్డుకు వెళ్లినట్టు సీనియర్‌ అసిస్టెంట్‌ తెలిపారు. ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి కార్యాలయంలో ఖాళీ పోస్టులు భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టాలని అంతా కోరుతున్నారు. 

Advertisement
Advertisement