పారదర్శకంగా నియామకాలు చేయాలి

ABN , First Publish Date - 2022-09-27T06:07:49+05:30 IST

అంగన్‌వాడీ గ్రేడ్‌-2 సూపర్‌వైజర్‌ పోస్టుల నియామకాలను పారదర్శకంగా నిర్వహించాలని పలువురు డిమాం డ్‌ చేశారు.

పారదర్శకంగా నియామకాలు చేయాలి
అంగన్‌వాడీ వర్కర్స్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో జరిగిన ధర్నా

 ఒంగోలు(కలెక్టరేట్‌), సెప్టెంబరు 26: అంగన్‌వాడీ గ్రేడ్‌-2 సూపర్‌వైజర్‌ పోస్టుల నియామకాలను పారదర్శకంగా నిర్వహించాలని పలువురు డిమాం డ్‌ చేశారు. ఆంధ్రప్రదేశ్‌ అంగన్‌వాడీ వర్కర్స్‌ హెల్పర్స్‌ యూనియన్‌ ఆధ్వ ర్యంలో సోమవారం కలెక్టరేట్‌ ఎదుట జరిగిన ధర్నాలో పి.కల్పన మాట్లా డారు. ఈనెల 18న జరిగిన సూపర్‌వైజర్‌ పోస్టుల పరీక్షకు వేలాది మంది అంగన్‌వాడీ వర్కర్లు ఎంతో ఆశతో పరీక్షలు రాశారన్నారు. పరీక్షలు ముగి సిన తర్వాత కీ విడుదల చేయకుండా ఇష్టారీతిన పోస్టులను భర్తీ చేసేందు కు ప్రయత్నాలు చేయడం దారుణంగా ఉందన్నారు. మెరిట్‌లిస్టుతో పాటు రోస్టర్‌ పద్ధతిని పాటించకుండా రహస్యంగా కొంత మందిని పిలిచి  ఎంపిక య్యావు, వెరిఫికేషన్‌ చేయాలని అధికారులు సమాచారం ఇచ్చి పిలిపించు కుంటున్నారని ఆరోపించారు. దీంతో పలు అనునామాలు వ్యక్తం అవుతున్నా యని తెలిపారు. అవినీతి, రాజకీయజోక్యానికి అవకాశం కల్పించినట్లుగా ఉందన్నారు. వెంటనే ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని అంగన్‌వాడీ సూప ర్‌వైజర్‌ పోస్టులను పారదర్శకంగా నిర్వహించేలా చర్యలు  తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో యూనియన్‌ సహాయ కార్యదర్శి ధనలక్ష్మి, కాలం సుబ్బారావు, బంకా సుబ్బారావు, జయశ్రీ, రామాంజమ్మ, ఎమీమా, ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు 

Updated Date - 2022-09-27T06:07:49+05:30 IST