గోకుల కృష్ణ.. గోపాల కృష్ణ..

ABN , First Publish Date - 2022-08-20T05:39:38+05:30 IST

శ్రీకృష్ణాష్టమి వేడుకలను శుక్రవారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు.

గోకుల కృష్ణ.. గోపాల కృష్ణ..
పంగులూరులో ఉట్టి కొట్టేందుకు పోటీ పడుతున్న యువకులు

వాడవాడలా కృష్ణాష్టమి వేడుకలు

అద్దంకి, ఆగస్టు 19: శ్రీకృష్ణాష్టమి వేడుకలను శుక్రవారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. శ్రావణ శుక్ర వారం కూడా కలిసి రావటంతో భక్తులు పె ద్ద సంఖ్యలో దేవాలయాలకు వెళ్ళి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణంలోని కాకాపాలెంలో శ్రీకృష్ణు ని మందిరం, శింగరకొండలోని శ్రీకృష్ణుని దేవాల యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శింగర కొండపాలెంలోని శ్రీకృష్ణుని విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. శింగరకొండలోని శ్రీకృష్ణ యాదవ అన్నదాన స త్రంలో ప్రత్యేక కార్యక్ర మాలతో పాటు భక్తుల కు అన్నదానం చేశారు.

పర్చూరు: శ్రీకృష్ణ జ న్మాష్టమి వేడుకలను మండలంలోని ఆయా గ్రామాల్లో శుక్రవారం ఘనంగా నిర్వహించా రు. స్థానిక ఆంధ్ర క్రికె ట్‌ ఆసోషియేషన్‌ సబ్‌ సెంటర్‌లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరిగాయి. శ్రీ కృష్ణుని వేష దారణలో చిన్నారులు ఉట్టి కొట్టి భక్తిని చాటుకున్నారు. వేడుకలను తిలకించేందుకు పెద్దఎత్తున చిన్నారులు, తల్లిదండ్రులు తరలిరావడం తో ప్రాంగణంలో సందడి వాతావరణం నెలకొంది. కార్యక్ర మంలో సబ్‌ సెంటర్‌ నిర్వహకులు తులసి శివనాగేశ్వరరావు, అనపర్తి నరేష్‌, తేళ్ళ రాము, కొసనా రమేష్‌, ఖాన్‌, సైదులు తదితరులు పాల్గొన్నారు. 

బల్లికురవ: మండలంలో శుక్రవారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు  వైభవంగా జరిగాయి. శ్రావణ మాసం శుక్రవారం రావటంతో భక్తులు ఈ పండుగను  భక్తి శ్రద్ధలతో జరుపుకొన్నారు. కృష్ణుడి విగ్రహాలు ఏ ర్పాటుచేసి ప్రత్యేక పూజలు చేశారు. కొణిదెనలో సేంద్రియ వ్యవసాయ క్షేత్రంలో గోవులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొత్తపాలెం, ముక్తే శ్వరం, నక్బఒక్కలపాడు, కొప్పెరపాడు, వల్లాపల్లి, మల్లాయపాలెం, ఉప్పుమాగులూరు, చెన్నుపల్లి, కొండాయపాలెం, ఎస్‌ఎల్‌ గుడిపాడు, అంబడిపూడి, గ్రామాలలో పండగ వేడుకల సందర్బంగా ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని యువకులు ఉత్సాహంగా నిర్వహించారు. పలు దేవాల యాలలోనూ కృష్ణాష్టమి వేడుకలను నిర్వహించారు. కార్యక్రమాలలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

చీరాల: శ్రీకృష్ణాష్టమి పర్వదినాన్ని భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకు న్నారు. శుక్రవారం ఉదయం నుంచి శ్రీకృష్ణ ఆలయాలతో పాటు ఇతర ఆలయాల్లో కూడా శ్రీకృష్ణాష్టమి ప్ర త్యేకపూజలు నిర్వహించారు. సంత బజారులోని వేణుగోపాలస్వామి అ లయంలో భక్తులు పెద్దసంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. అ నంతరం జరిగిన నగరోత్సవంలో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. పాపరాజుతోట, యాదవపాలెం, సంపత్‌నగర్‌ మూడు రోడ్లు కూడలి లోని శ్రీకృష్ణుని ఆలయాల్లో పూజలు నిర్వహించారు. ఆలయాలను, చుట్టుపక్కల ప్రాంతాలను విద్యుత్‌ దీపాలతో అలంకరించారు. పూజల అనంతరం భక్తులకు ప్రసా ద వితరణ జరిగింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిర్వ హకులు తగిన ఏర్పాట్లు చేశారు.

చినగంజాం: మండల పరిధిలోని పలుగ్రామాల్లో కృష్ణాష్టమి వేడుక లను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. శ్రావణ బహుళ అష్టమిని పురస్కరించుకుని పలు ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు  జరిపా రు. కడవకుదురులోని శ్రీకృష్ట మందిరంలో కృష్ణాష్టమిని పురస్కరించు కుని ఉదయం 5గంటలకు పంచామృతాలతో అభిషేకాలు జరిపారు. చినగంజాం భూసమేత భావనారాయణస్వామి ఆలయంలో శ్రీకృష్ణ స్వామిని ప్రత్యేకంగా అలంకరించి, ప్రత్యేక పూజలు జరిపారు. ప్రత్యే కంగా అలంకరించిన ట్రాక్టర్‌పై స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని విశేషం గా అలకరించి గ్రామ పురవీధులలో ఊరేగింపు నిర్వహించారు.  తదనంత రం ఆలయాల వద్ద గోపూజ కార్యక్రమా లను నిర్వహించారు. కడవకుదురు, చి నగంజాం గ్రామాల్లో ఉట్టికొట్టు కార్యక్ర మంలో యువకులు, పెద్దలు, మహిళ లు ఉత్సహంగా పాల్గొన్నారు.. 

మార్టూరు: శ్రీకృష్ణాష్టమి సందర్భంగా శుక్రవారం రాత్రి మార్టూరులో యాదవ యువకులు వివిధ రకాల ఆటలు, పా టలతో సందడి చేశారు. కొంతమంది యువకులు బాలబాలికలతో గోపికలు, కృష్ణ్ణుడి వేషధారణ చేయించారు. తదనంతరం ఉట్టిని కొట్టేందుకు యువకులు ఉత్సాహం చూపించారు. ఈ సందర్భంగా వసంతాలు చల్లుకొని  కేరింతలు కొట్టారు. 

పంగులూరు: కృష్ణాష్టమి వేడుకలు  మండలంలో ఘనంగా జరిగా యి. పలు గ్రామాలలో  యువత ఉత్సాహంగా ఉట్టికొట్టే వేడుక నిర్వ హించారు. పంగులూరులో జరిగిన కార్యక్రమంలో పలువురు యువ కులు పాల్గొన్నారు.

Updated Date - 2022-08-20T05:39:38+05:30 IST