మహానుభావుల త్యాగాల ఫలితమే స్వాతంత్య్రం

ABN , First Publish Date - 2022-08-11T05:21:13+05:30 IST

లక్షలాది మంది పోరాటం, వేలాది మంది ప్రాణత్యాగాలతో బ్రిటిష్‌ వారి నుంచి స్వాతంత్య్రం వచ్చిందని వారి ప్రాణత్యాగాలను గుర్తు చేసుకునేవిధంగా సీఎం కేసీఆర్‌ వజ్రోత్సవాలను ఘనం గా నిర్వహిస్తున్నారని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు.

మహానుభావుల త్యాగాల ఫలితమే స్వాతంత్య్రం
పూడూరు గ్రామంలో బృహత్‌ పల్లెప్రకృతి వనంలో మొక్కలు నాటుతున్న ఎమ్మెల్యే, నాయకులు

- వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించుకుందాం

- పూడూరు గ్రామంలోని ఫ్రీడమ్‌ పార్కులో 

మొక్కలు నాటిన ఎమ్మెల్యే కృష్ణమోహన్‌ రెడ్డి

గద్వాల, ఆగస్టు 10: లక్షలాది మంది పోరాటం, వేలాది మంది ప్రాణత్యాగాలతో బ్రిటిష్‌ వారి నుంచి స్వాతంత్య్రం వచ్చిందని వారి ప్రాణత్యాగాలను గుర్తు చేసుకునేవిధంగా సీఎం కేసీఆర్‌ వజ్రోత్సవాలను ఘనం గా నిర్వహిస్తున్నారని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. బుధవారం మండల పరిధిలోని పూడూరు గ్రామంలోని ఫ్రీడం పార్కులో 750మొక్కలను   నాటా రు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వాతం త్య్ర వజ్రోత్సవాలు ఆగస్టు 22వరకు  వివిధ రూపాల్లో నిర్వహిస్తున్నామని అందరు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రతీ ఇంటిపై జెండాను ఆవిష్కరించి దేశభక్తిని చాటాలని ఆయన కోరారు. పల్లె ప్రకృతి, బృ హత్‌ ప్రకృతి వనాలతో గ్రామాలలో పచ్చదనం కళకలా డుతున్నదని వివరించారు. ఆహ్లాదం కోసం ప్రతి ఒక్క రు పార్కులను సద్వినియోగం చేసుకోవాలని సూచిం చారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచు శశికళ, జిల్లా పంచాయతీ అధికారి శ్యాంసుందర్‌, ఎంపీపీ ప్రతాప్‌ గౌడ్‌, ఎంపీడీవో రవీంద్ర, ఏపీవో శివజ్యోతి, ఎంపీటీసీ సభ్యుడు శంకర్‌ గౌడ్‌, పీఏసీఎస్‌ ఉపాధ్యక్షుడు వెం కటేష్‌, పంచాయతీ కార్యదర్శి శారద, నాయకులు ర మేష్‌నాయుడు,  లక్ష్మీకాంతారెడ్డి,  నర్సింహారెడ్డి, శ్యాం రెడ్డి, అచ్చన్న గౌడ్‌, చెన్నయ్య, గ్రామస్థులు పాల్గొన్నారు.

= గద్వాలటౌన్‌ : గద్వాల పట్టణంలోని 18వార్డులో రూ.25లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ఫ్రీడం పార్క్‌ ను బుధవారం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి, ము నిసిపల్‌ చైర్మన్‌ బీఎస్‌ కేశవ్‌ ప్రారంభించారు. ఈ సంద ర్భంగా స్వాతంత్య్ర వజ్రోత్సవాల నేపథ్యంతో పార్కులో 75సంఖ్య ఆకారాన్ని మొక్కలతో ఏర్పాటు చేయడం ప్రత్యేకతను సంతరించుకుంది.  పార్కులో ఏర్పాటు చేసిన ఓపెన్‌ జిమ్‌ పరికరాలను పరిశీలిం చా రు. అనంతరం రాజీవ్‌ స్వగృహ సమీపంలో వజ్రోత్సవ వనమహోత్సవంలో భాగంగా 750 మొక్కలు నాటే కా ర్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.  కార్యక్రమంలో మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ బాబర్‌, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ రామేశ్వమ్మ, కౌన్సిలర్లు, విశ్రాంత ప్ర భుత్వ ఉద్యోగుల సంఘం నాయకులు, టీఆర్‌ఎస్‌ నాయకులు ఉన్నారు.

పోరాట స్ఫూర్తిని గుర్తు చేసుకుందాం

అలంపూర్‌: మహాత్ముల వీరోచిత పోరాటం, త్యాగ ఫలమే భారతదేశానికి స్వాతం త్య్రం సిద్ధించిందని, ప్రతీఒక్కరు మహానీయుల పోరాట స్ఫూర్తిని గుర్తు చేసుకుందామని  అలంపూరు ఎమ్మెల్యే డాక్టర్‌ వీఎం అబ్రహాం అన్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా బుధవారం అలంపూర్‌ మునిసిపాలిటీలో ఏర్పాటు చేసిన మొక్కలు నాటడం, ఫ్రీడం పార్క్‌ల ఏర్పాటు కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మా ట్లాడారు. దేశానికి స్వాతంత్య్ర సిద్ధించి 75ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా సమరయోధులను స్మ రించుకుని, వారి పోరాట పటిమను గుర్తు చేసు కునే విధంగా వజ్రోత్సవ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాలన్న సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకు న్నందుకు  ధన్యవాదా లు తెలి పారు. ఈ వేడుకలు 15రోజుల పాటు నిర్వహించడం ఆనందకరమన్నారు.  కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆదర్శ గ్రామాల్లో జోగుళాంబ గద్వాల జిల్లా నుంచి నాలుగు గ్రామాలు ముందువరుసలో ఉండటం గర్వకారణమన్నారు. స్వా తంత్య్ర వేడుకల్లో అందరూ భాగస్వాములు కావాలని కోరారు.  కార్యక్రమంలో మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ శేఖర్‌ రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌, కౌన్సిలర్లు, కో ఆప్షన్‌ మెంబర్లు, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు, అధికారులు ఉన్నారు.

మొక్కల సంరక్షణ అందరి బాధ్యత  

కేటీదొడ్డి: ప్రతీ ఒక్కరు మొక్కలను నాటి వాటి సం రక్షణకు చర్యలు తీసుకోవాలని జడ్పీ చైర్‌పర్సన్‌ సరిత అన్నారు. బుధవారం మండలంలోని మల్లాపురం తండాలో నిర్వహించిన వన మహోత్సవ కార్యక్ర మంలోజడ్పీ చైర్‌పర్సన్‌ పాల్గొని మొక్కలను నాటారు.  కార్యక్రమంలో సర్పంచు శంకరమ్మ, జడ్పీ సీఈవో విజయా నాయక్‌, ఎంపీడీవో సయ్యద్‌ ఖాన్‌, పంచాయతీ కా ర్యదర్శి రామ కృష్ణ, టీఆర్‌ఎస్వీ జిల్లా కో-ఆర్డినేటర్‌ కుర్వ పల్లయ్య, నాగేష్‌నాయక్‌, నరసిం హ, లక్ష్మయ్య, పోలీస్‌ సిబ్బంది పాల్గొ న్నారు. అలాగే మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ మనోరమ్మ, వైస్‌ఎంపీపీ రామకృష్ణనాయుడు జా తీయ జెండాలను ప్రజా ప్రతి నిధులకు, నాయకులకు పంపిణీ చే శారు. ప్రతీ ఇంటి పై జాతీయ జెం డాలను ఎగురవేయాలని సూచిం చారు.  కార్యక్రమంలో తహసీల్దార్‌ సుందర్‌ రాజు, ఎంపీడీవో సయ్యద్‌ఖాన్‌, టీఆర్‌ఎస్‌  మండల అధ్యక్షుడు ఉరుకుందు, పోలీస్‌ సిబ్బంది, ఆయా గ్రామాల సర్పంచు లు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. 

 = అయిజ: అయిజ మండల పరిధిలోని మేడికొండ గ్రామంలో  జాతీయ జెండాలను ఢిల్లీలో తెలంగాణ రా ష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి మందా జగన్నాథం  పం పిణీ చేశారు.  అలాగే మొహర్రం వేడుకల్లో పాల్గొన్నా రు.  కార్యక్రమంలో మందా శ్రీనాథ్‌, ఉప్పల ఎంపీటీసీ ప్రహ్లాదరెడ్డి, సర్పంచుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆత్మలింగారెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు వెంకటేష్‌, రవిరెడ్డి, నర్సింహ, అంజి, రాముడు, వీరేష్‌, శివన్న పాల్గొన్నారు.  అయిజ పట్టణంలో  ఏర్పాటు చేసిన ఫ్రీడం పార్కును మునిసిపల్‌ చైర్మన్‌ దేవన్న ప్రారంభించారు. కార్యక్రమంలో కమిషనర్‌ నరసయ్య, అసిస్టెంట్‌ ఇంజనీర్‌ గోపాల్‌, మేనేజర్‌ రాజేష్‌, కౌన్సిలర్లు బాగ్యలక్ష్మి, నర్సింహులు, అధికారులు రమేష్‌, లక్ష్మన్న, వీరేందర్‌, సురేష్‌, లక్ష్మిరేఖ, నాగరాజు, నరేష్‌, ఆంజనేయులు పాల్గొన్నారు. అలాగే  మునిసిపాలిటీ పరిధిలో, గ్రామాలలోనూ ఇంటింటికి జాతీయ జెండాలు పంపిణీ చేశారు.  ప్రజలు  జెండాలను తమ ఇళ్లపై ఎగురవేశారు. ఎక్కడ చూసిన జాతీయ జెండాల రెపరెపలాడుతూ కనిపించాయి. 







Updated Date - 2022-08-11T05:21:13+05:30 IST