ప్రశాంతంగా ‘పది’ పరీక్షలు

ABN , First Publish Date - 2022-05-24T04:35:57+05:30 IST

మండలంలో మొదటిరోజు ‘పది’ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి.

ప్రశాంతంగా ‘పది’ పరీక్షలు
మిడ్జిల్‌లో ఏర్పాటుచేసిన పరీక్షా కేంద్రం వద్ద నెంబర్లను చూసుకుంటున్న విద్యార్థినులు

భూత్పూర్‌, మే 23: మండలంలో మొదటిరోజు ‘పది’ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. మండలం లోని ఎనిమిది జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలల విద్యార్థులు మొత్తం 517మంది పరీక్షలకు హాజరు కావల్సి ఉండగా ఐదు మంది విద్యార్థులు గైర్హాజర య్యారని ఎంఈవో నాగయ్య తెలిపారు. 

మిడ్జిల్‌ : మండల కేంద్రంలో ఏర్పాటుచేసిన పదో తరగతి పరీక్షా కేంద్రాల్లో 312 మంది విద్యార్థులకు గాను తొమ్మిదిమంది గైర్హాజరైనట్లు ప రీక్ష కేంద్రం ఇన్‌చార్జిలు సోమవారం తెలిపారు. సమయానికి చేరుకున్న విద్యార్థులు రూం నెంబర్లను చూసుకొని పరీక్ష రాసేందుకు వెళ్లారు. మొదటిరోజు పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి.

రాజాపూర్‌ : మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటుచేసిన ‘పది’ పరీక్షల కేంద్రంలో మొదటి రోజు 235 మంది విద్యార్థులకు వందశాతం విద్యార్థులు హాజరైనట్లు పరీక్ష కేంద్రం ఇన్‌చార్జి గోవర్ధన్‌ తెలిపారు. సోమవారం పరీక్షా కేంద్రాన్ని ఆర్‌జేడీ విజయలక్ష్మి, తహసీల్దార్‌ శంకర్‌, ఎంపీడీవో లక్ష్మిదేవిలతో కలిసి పరిశీలించినట్లు ఆ యన వివరించారు. 

చిన్నచింతకుంట : మండలంలో సోమవా రం పదవ తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరి గాయి. వడ్డెమాన్‌ పరీక్షా కేంద్రంలో 244 మంది విద్యార్థులకు గాను 238 మంది పరీక్షకు హాజర య్యారు. చిన్నచింతకుంట పరీక్షా కేం ద్రంలో 239 మంది విద్యార్థులకు గాను 235 మంది హాజరయ్యారు. కేంద్రాలను ఎంఈవో లక్ష్మణ్‌సింగ్‌ పరిశీలించారు. 

హన్వాడ : మండలంలో ‘పది’ పరీ క్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభ మయ్యాయి. హన్వాడ ఉన్నత పాఠశాల లో 200 మంది విద్యార్థులు పరీక్ష రాశా రు. వేపూర్‌ కేంద్రంలో 155 మంది విద్యా ర్థులకు ముగ్గురు, హన్వాడ రెండవ కేం ద్రంలో 160 మంది విద్యార్థులకు ఇద్దరు గైర్హాజర య్యారు. మొత్తం 515 మందికి ఐదుగురు విద్యా ర్థులు గైర్హాజరయ్యారు. 

మూసాపేట : మండల కేంద్రంతో పాటు, జానంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ‘పది’ పరీక్షలు ప్రారంభమయ్యాయి. మూసాపేట కేం ద్రంలో 169 మంది విద్యార్థులకు గాను ఐదుగురు, జానంపేట కేంద్రంలో 233 మంది విద్యార్థులకు ఐదుగురు గైర్హాజరైనట్లు, మొత్తం 402 మంది వి ద్యార్థులకు పది మంది గైర్హాజరయ్యారని ఎంఈవో రాజేశ్వర్‌రెడ్డి తెలిపారు. 

బాదేపల్లి : జడ్చర్లలో ‘పది’ పరీక్షలు సోమ వారం ప్రశాంతంగా జరిగాయి. మండలంలోని ఎని మిది కేంద్రాల్లో మొత్తం 1860 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కావల్సి ఉండగా, 21 మంది గైర్హాజరైనట్లు ఎంఈవో కె.మంజులదేవి తెలిపారు. 

బాలానగర్‌ : మండలంలో ‘పది’ పరీక్షలు  ప్రశాంతంగా జరిగాయి. మొత్తం 739 మంది వి ద్యార్థులకు గాను 14 మంది గైర్హాజరైనట్లు ఎం ఈవో వెంకటయ్య తెలిపారు. 

దేవరకద్ర : మండల కేంద్రంలో ‘పది’ పరీ క్షలు ప్రశాంతంగా జరిగినట్లు ఎంఈవో జయశ్రీ తెలిపారు. మొత్తం నాలుగు పరీక్షా కేంద్రాల్లో 933 మంది విద్యార్థులకు గాను ముగ్గురు గైర్హాజరయ్యా రని ఆమె చెప్పారు. 

కోయిలకొండ : మండల కేంద్రంలో ‘పది’ పరీక్షల కోసం నాలుగు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఎంఈవో లక్ష్మణ్‌ తెలిపారు. మొత్తం 596 మంది విద్యార్థులకు గాను 11 మంది గైర్హాజరు కాగా, 585 మంది పరీక్షలు రాసినట్లు ఆయన చెప్పారు. 

Updated Date - 2022-05-24T04:35:57+05:30 IST