సీతారాముల కల్యాణం కమనీయం

ABN , First Publish Date - 2022-05-23T04:54:45+05:30 IST

సీతారాముల కల్యాణం కమనీయంగా జరిగింది.

సీతారాముల కల్యాణం కమనీయం
ముకురాలలో సీతారాముల కల్యాణంలో పాల్గొన్న ఎంపీ రాములు, జడ్పీటీసీ భరత్‌ప్రసాద్‌

- దైవభక్తి కలిగి ఉండాలి:  ఎంపీ పోతుగంటి రాములు


కల్వకుర్తి, మే 22: సీతారాముల కల్యాణం కమనీయంగా జరిగింది. కల్యాణ మహోత్సవంలో నాగర్‌కర్నూల్‌ ఎంపీ పోతుగంటి రాములు, కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్క జైపాల్‌యాదవ్‌,  జడ్పీ వైస్‌ చైర్మన్‌ఠాకూర్‌బాలాజీసింగ్‌, జడ్పీటీసీల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోతుగంటి భరత్‌ప్రసాద్‌, పలువురు నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కల్వకుర్తి మండల పరిధిలోని ముకురాల గ్రామంలో నూతనంగా నిర్మించిన సీతారామచంద్రస్వామి దేవాలయంలో ఆదివారం సీతారాముల కల్యాణం, ధ్వజస్తంభ, బొడ్రాయి ప్రతిష్ఠాపనలు వేద మంత్రోచ్ఛారణల మధ్య జరిగాయి. కార్య క్రమానికి హాజరైన ఎంపీ పోతుగంటి రాములు మాట్లాడుతూ ప్రజలను చల్లగా చూ డాలని, పాడి పంటలతో తులతూగేలా చూడాలని మొక్కుకున్నారు. దేవాలయాన్ని అత్యంత సుందరంగా నిర్మించి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ఎంపీ పేర్కొన్నారు. ముకురాల గ్రామానికి గుండూరు నుంచి రూ.4కోట్లతో బీటీ రో డ్డును పూర్తి చేయించామని తెలిపారు. మునిసిపల్‌ చైర్మన్‌ ఎడ్మ సత్యం, వెల్దండ జడ్పీటీసీ విజితారెడ్డి, గ్రామ సర్పంచ్‌ నరేందర్‌రెడ్డి, ఎంపీటీసీ నర్సిరెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ నాయకులు తదితరులు ఉన్నారు. 



Updated Date - 2022-05-23T04:54:45+05:30 IST