నెలసరి నొప్పికి చెక్‌!

ABN , First Publish Date - 2022-01-18T07:57:46+05:30 IST

లసరి నొప్పిని అదుపులోకి తీసుకురావడం తేలికే! కొన్ని పనులకు దైనందిన జీవితంలో చోటు కల్పిస్తే, ఆ నొప్పులు క్రమేపీ తగ్గిపోతాయి.

నెలసరి నొప్పికి చెక్‌!

సరి నొప్పిని అదుపులోకి తీసుకురావడం తేలికే! కొన్ని పనులకు దైనందిన జీవితంలో చోటు కల్పిస్తే, ఆ నొప్పులు క్రమేపీ తగ్గిపోతాయి. 

నొప్పి ఎందుకంటే?: నెలసరి నొప్పులకు కారణం ఆ సమయంలో శరీరంలో అసమతౌల్యానికి గురయ్యే హార్మోన్లే! హార్మోన్ల అసమతౌల్యానికి ప్రధాన కారణం పోషకాహార లోపం. దీంతోపాటు పర్యావరణం, కాలుష్యం, విషాలు, ఒత్తిడి... నెలసరి నొప్పులను పెంచుతాయి. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని నొప్పులను తగ్గించే చిట్కాలు పాటించాలి.


 ఇందుకోసం...

వ్యాయామం: వ్యాయామం వల్ల కండరాలు వదులవుతాయి. మరీ ముఖ్యంగా నడుము, పొత్తికడుపు, కాళ్లకు సంబంధించిన వ్యాయామాలు చేస్తే నెలసరిలో వేధించే నొప్పులు క్రమంగా తగ్గుముఖం పడతాయి.


హీటింగ్‌ ప్యాడ్‌: నొప్పి ఉన్న ప్రదేశంలో వేడినీళ్లు నింపిన హీటింగ్‌ ప్యాడ్‌తో కాపడం పెట్టినా ఫలితం ఉంటుంది.

వేడినీటి స్నానం: నెలసరిలో ఉన్నన్ని రోజులూ వేడినీటి స్నానం చేయాలి. ఇలా చేసినా కండరాలు రిలాక్స్‌ అయి, నొప్పులు తగ్గుతాయి.

కంటి నిండా నిద్ర: ఈ సమయంలో విశ్రాంతి మంచి ఫలితాన్నిస్తుంది. పగటివేళ కొద్దిసేపు కునుకు తీస్తూ ఉండాలి.

తక్కువ ఉప్పు: ఈ సమయంలో ఆహారంలో ఉప్పు తగ్గించాలి. ఉప్పు శరీరంలో నీరు నిలిచి ఉండేలా చేస్తుంది. దీంతో శరీరం బరువుగా తయారై అసౌకర్యం కలిగిస్తుంది. 

Updated Date - 2022-01-18T07:57:46+05:30 IST