Advertisement
Advertisement
Abn logo
Advertisement

అమరావతి రైతులకు ఘన స్వాగతం

చిట్టమూరు, డిసెంబరు 4 : న్యాయస్థానం నుంచి దేవస్థానం నినాదంతో అమరావతి రైతులు చేస్తున్న మహా పాదయాత్ర గూడూరు నియోజకవర్గం తిప్పవరప్పాడుకు చేరుకో గా  శనివారం ఉదయం చిట్టమూరు టీడీపీ నేతలు ఘన స్వాగ తం తెలియజేశారు. గూడూరు నియోజకర్గ మాజీ ఎమ్మెల్యే పాశిం సునీల్‌కుమార్‌ నేతృత్వంలో మండల టీడీపీ కన్వీనర్‌ గణపర్తి కిషోర్‌నాయుడు నాయకులు, కార్యకర్తలతో తిప్పవరప్పాడు గ్రామానికి చేరుకున్నారు. అమరావతి మహా పాదయాత్ర అక్కడికి చేరుకోవడంతో వారికి ఘనంగా స్వాగతం పలికి సంఘీభావం తెలియజేశారు. అమరావతి రైతులతో కలసి చెమిర్తి పుట్టమ రాజు కండ్రిగ వరకు మహాపాదయాత్రలో పాల్గొన్నారు. ఈ కార్య క్రమంలో టీడీపీ సీనియర్‌ నాయుకులు రాజగోపాల్‌రెడ్డి, జనార్దన్‌ రెడ్డి, హరికృష్ణారెడ్డి, గిరి నాయుడు, సునీల్‌రెడ్డి, శ్రీనివాసులు, చిన్నారావు, చెంచురామయ్య, అంకయ్య, వెంకటరమణయ్య తదితరులు పాల్గొన్నారు.  

కోట : న్యాయస్థానం నుంచి దేవస్థానం పాదయాత్రకు శనివారం కోట టీడీపీ కన్వీనర్‌ సర్వోత్తమరెడ్డి, మైనార్టీసెల్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి జలీల్‌ అహ్మద్‌ ఆధ్వర్యంలో నినాదాలు చేసుకుంటూ బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు దారా సురేష్‌, షంషుద్దీన్‌, మధుయాదవ్‌, మస్తాన్‌బాషా,  అనిల్‌, నౌషాద్‌, తీగల సురేష్‌బాబులు ఉన్నారు. 

రాపూరు: అమరావతి రైతుల పాదయాత్రలో రాపూరు మండల టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి కొండ్లపూడి రాఘవరెడ్డి జాతీయ జెండాతో పాల్గొన్నారు. 


అమరావతి పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న టీడీపీ నాయకులు


Advertisement
Advertisement