గుర్రప్ప కుటుంబీకులను పరామర్శించి భరోసా ఇస్తున్న కిశోర్‌కుమార్‌ రెడ్డి

ABN , First Publish Date - 2022-09-28T05:30:00+05:30 IST

వైసీపీ ప్రభుత్వంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రక్షణ లేకుండా పోయిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్‌కుమార్‌ రెడ్డి ఆరోపించారు.

గుర్రప్ప కుటుంబీకులను పరామర్శించి భరోసా ఇస్తున్న కిశోర్‌కుమార్‌ రెడ్డి
గుర్రప్ప కుటుంబీకులను పరామర్శించి భరోసా ఇస్తున్న కిశోర్‌కుమార్‌ రెడ్డి

ఫ బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రక్షణ కరువు

ఫ నల్లారి కిశోర్‌కుమార్‌ రెడ్డి  


కలికిరి, సెప్టెంబరు 28: వైసీపీ ప్రభుత్వంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రక్షణ లేకుండా పోయిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్‌కుమార్‌ రెడ్డి ఆరోపించారు. కలికిరి పట్టణ శివారులో సైనిక్‌ స్కూల్‌కు ఎదురుగా వున్న బీసీ వర్గానికి చెందిన గుర్రప్ప కుటుంబానికి చెందిన భూమిని ఆక్రమించుకునేందుకు జరిగిన దౌర్జన్యకర ప్రయత్నాలను ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రఽధాన రహదారికి పక్కనే వున్న 4 ఎకరాల మామిడి తోటను ఆక్రమించుకునేందుకు అర్ధరాత్రి ఎక్సకవేటర్‌తో 30 ఏళ్ల మామిడి చెట్లను కూల్చి వేయడం దారుణమన్నారు. బుధవారం మామిడి చెట్లను కూల్చేసిన భూమిని కిశోర్‌ కుమార్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా మామిడితోట యజమానులైన గుర్రప్ప కుటుంబీకులు అర్ధరాత్రి జరిగిన దౌర్జన్యం గురించి ఆయనకు వివరించారు.  దౌర్జన్యకారులు తమకు ఎవరూ దిక్కులేరని... మా భూమిని కాజేయడానికి ప్రయ త్నించారని కిశోర్‌కుమార్‌రెడ్డి ముందు విలపించారు. సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా మూడు రోజులకు కేసు నమోదు చేశారని... ఇప్పటికీ దౌర్జన్యకారులపై చర్యలు తీసుకోలేదని వివరించారు. తమకు అండగా నిలబడి భూమిని కాపాడాలని వేడుకున్నారు. ఇందుకు ఆయన స్పందిస్తూ టీడీపీ అన్ని విధాల అండగా నిలబడి ఆదుకుంటామని  భరోసా ఇచ్చారు. ఈ మామిడి తోటకు పక్కనే వున్న మరో బీసీ కులానికి చెందిన ఈశ్వరయ్య అనే రైతు కూడా తమ కుటుంబంపై దౌర్జన్యం చేసి... మా భూమిని కూడా ఆక్రమించుకున్నారని కిశోర్‌కుమార్‌రెడ్డి దృష్టికి తెచ్చారు. అధికారులకు, పోలీసులకు మొరపెట్టుకున్నా వారు దౌర్జన్యకారులకే మద్దతిచ్చారని తెలిపారు. చివరికి తహసీల్దారు రమణిపై వ్యక్తిగతంగా హైకోర్టుకు ఫిర్యాదు చేశానని, దీనిపై ఎలాంటి జోక్యం చేసు కోరాదని  హై కోర్టు జారీ చేసిన ఆదేశాలను ఈశ్వరయ్య చూపించారు. అధికారులు, పోలీసులు దౌర్జన్యాలను వెనకేసుకొస్తే పరిణామాలను ఎదుర్కోక తప్పదని కిశోర్‌కుమార్‌ హెచ్చరించారు. కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు నిజాముద్దీన్‌, నాయకులు మల్‌ రెడ్డి, ఆర్టీసీ రెడ్డెప్పరెడ్డి, జ్ఞానమూర్తి, టైలర్‌ బాబు, సురేష్‌కుమార్‌ రెడ్డి, ఆనంద రెడ్డి, అశోక్‌, మున్వర్‌ ఆలీ, వర్మ తదితరులు పాల్గొన్నారు. 



 

Updated Date - 2022-09-28T05:30:00+05:30 IST