IAS Officers: ఏపీలో ఐఏఎస్ అధికారుల బదిలీ

ABN , First Publish Date - 2022-08-13T15:26:24+05:30 IST

Transfer of IAS Officers in AP

IAS Officers: ఏపీలో ఐఏఎస్ అధికారుల బదిలీ

అమరావతి: రాష్ట్రంలో ఐఏఎస్ అధికారుల (IAS officers)ను బదిలీ చేస్తూ శనివారం ఉదయం ఉత్తర్వులు జారీ అయ్యాయి. సాంకేతిక విద్యా శాఖ డైరెక్టరుగా నాగరాణి (Nagamani)ని నియమిస్తూ ప్రభుత్వం (AP Government) ఉత్తర్వులు జారీ చేసింది. సాంకేతిక విద్యా శాఖ డైరెక్టర్ బాధ్యతల నుంచి పొల భాస్కర్ (Bhaskar)ను  రిలీవ్ చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. జౌళి, చేనేత శాఖ కమిషనర్ గా ఎం. ఎం నాయక్‌ (MM Naik) నియమితులయ్యారు. అలాగే ఎం. ఎం నాయక్‌కు ఆప్కో సీఎండీ, ఖాదీ విలేజ్ బోర్డు సీఈఓగా అదనపు బాధ్యతలు అప్పగించారు. బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి(Jayalaxmi)కి సాంఘీక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఆదేశించారు.


పాఠశాల విద్య శాఖలో పాఠశాలల్లో మౌళిక వసతుల కల్పన కమిషనర్‌గా కాటంనేని భాస్కర్ (Katamneni bhaskar) నియమితులయ్యారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రత్యేకాధికారిని నియమించాలని సీఎం జగన్ ఆదేశాల మేరకు ప్రభుత్వం కొత్త పోస్టు ఏర్పాటు చేసింది. ఆ మేరకు కాటంనేని భాస్కర్‌కు బాధ్యతలు అప్పగించారు. అలాగే మిషన్ క్లీన్ కృష్ణా-గోదావరి కెనాల్స్ కమిషనర్‌గా అదనపు బాధ్యతల్లో కాటంనేని  కొనసాగనున్నారు. సర్వ శిక్షాభియాన్ అదనపు ప్రాజెక్ట్ డైరెక్టరుగా బి. శ్రీనివాస రావు (B.srinivas rao) నియమితులయ్యారు. దీంతో పాటు రైతు బజార్ల సీఈఓగా శ్రీనివాసరావుకు అదనపు బాధ్యతల అప్పగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 

Updated Date - 2022-08-13T15:26:24+05:30 IST