ఏయూలో బీటెక్‌ ఫుడ్‌ టెక్నాలజీ కోర్సు

ABN , First Publish Date - 2022-05-26T05:22:55+05:30 IST

ఆంధ్ర విశ్వవిద్యాలయంలో రానున్న విద్యాసంవత్సరం నుంచి బీటెక్‌ ఫుడ్‌ టెక్నాలజీ కోర్సును ప్రారంభించనున్నట్లు ఏయూ వీసీ పి.వి.జి.డి.ప్రసాద్‌రెడ్డి తెలిపారు.

ఏయూలో బీటెక్‌ ఫుడ్‌ టెక్నాలజీ కోర్సు
టీసీఎస్‌ ప్రతినిధులను సత్కరిస్తున్న వీసీ ప్రసాద్‌రెడ్డి

వర్సిటీ వీసీ ప్రసాద్‌రెడ్డి

ఏయూ క్యాంపస్‌, మే 25: ఆంధ్ర విశ్వవిద్యాలయంలో రానున్న విద్యాసంవత్సరం నుంచి బీటెక్‌ ఫుడ్‌ టెక్నాలజీ కోర్సును ప్రారంభించనున్నట్లు ఏయూ వీసీ పి.వి.జి.డి.ప్రసాద్‌రెడ్డి తెలిపారు. టీసీఎస్‌ సంస్థ అకడమిక్‌ ఇంటర్‌ఫేస్‌ ప్రొగ్రాం జీఎం చంద్ర కోడూరుతో కూడిన బృందం బుధవారం సాయంత్రం వీసీ ప్రసాద్‌రెడ్డిని కలిసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్సిటీ విద్యార్థులను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు.


విద్యార్థులకు ఉపయుక్తంగా నిలిచే పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా పనిచేసే ప్రత్యేకమైన కోర్సులను నిపుణులతో బోధించాలని ఆయన ఆహ్వానించారు. టీసీఎస్‌ సంస్థ అకడమిక్‌ ఇంటర్‌ఫేస్‌ ప్రొగ్రాం జీఎం చంద్ర కోడూరు మాట్లాడుతూ ఏయూలో చదివే విద్యార్థులకు మరిన్ని మార్గదర్శకాలు అందిస్తే మెరుగైన ఫలితాలు సాధిస్తారని చెప్పారు. కార్యక్రమంలో ఆచార్యులు పి.శ్రీనివాసరావు, యుగంధర్‌, టీసీఎస్‌ ప్రతినిధి సిహెచ్‌.రిచర్డ్‌ కింగ్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీసీఎస్‌ ప్రతినిధులను వీసీ సత్కరించారు. 

Updated Date - 2022-05-26T05:22:55+05:30 IST