Abn logo
Feb 8 2020 @ 01:11AM

1946 నాటి పరిస్థితి లోకే..

పౌరసత్వ సవరణ చట్టాన్ని  బూచిగా చూపి ముస్లిం ప్రజలందరినీ తమ వైపు తిప్పుకొనేందుకు కాంగ్రెసు, కమ్యూనిస్టు పార్టీలు చేస్తున్న జాతి వ్యతిరేక విధానాలను ఈ దేశ హితం కోరేవారందరూ నిరసించాలి. ప్రజలు తమ కేమీపట్టనట్టు ఉంటే 1946 నాటి ప్రత్యక్ష చర్య లాంటి పరిస్థితిని ఎదుర్కోవలసి వస్తుంది అనేది అక్షర సత్యం. ముస్లిములందరినీ రెచ్చగొట్టే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ విషయంలో ప్రజలకు వాస్తవాలను వివరించి చెప్పడంలో జాతీయ వాద సంస్థలు వెనుక బడ్డాయి. ఇప్పటికైనా జాతీయ వాదులు జాతి జనులను చైతన్యం చేసే పనిని సమర్థవంతంగా చేయాలి.

ఝాన్సీ రాణి, కడప జిల

Advertisement
Advertisement