Abn logo
Mar 8 2021 @ 00:12AM

ఒక్క కెమెరా.. వంద కన్నులతో సమానం

భీంపూర్‌, మార్చి7: ఒక్క కెమెరా వంద కన్నులతో సమానమని డీఎస్పీ వెంకటేశ్వర్‌రావు అన్నారు. మండలంలో అర్లి(టి)లో ఆదివారం జైనథ్‌ సీఐ కె.మల్లేష్‌, ఎస్సై ఎండీ అరీఫ్‌లతో కలిసి సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతతూ సీసీ కెమెరాల ద్వారా దొంగతనాలు, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టవచ్చన్నారు.  మండలంలో అన్ని గ్రామాల్లో  సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అనంతరం సీసీ కెమెరాల ఏర్పాటు చేయడంలో తోడ్పాటునందించిన వీడీసీని డీఎస్పీ సన్మానించారు. ఈ కా ర్యక్రమంలో సర్పంచ్‌ రమబాయి, లస్మన్న, ఎంపీటీసీ స్వప్న పాల్గొన్నారు.

Advertisement
Advertisement