Abn logo
Mar 6 2021 @ 00:19AM

నరసన్నపేటలో నైపుణ్యాభివృద్ధి కళాశాల

నరసన్నపేట: నరసన్నపేటలోని వంశధార కార్యాలయం సమీపంలో  వృత్తి నైపుణ్యాభివృద్ధి సం స్థ కళాశాలను ఏర్పాటు చేయనున్నట్లు జేసీ సుమీత్‌ కుమార్‌  చెప్పా రు. ఈమేరకు శుక్రవారం వంశధార కార్యాలయ ఆవ రణలోని స్థలాన్ని ఆయన పరిశీలించారు.  ప్రభుత్వ ఆదేశాల మేరకు నాలుగు ఎకరాల స్థలాన్ని గుర్తించి ఇరిగేషన్‌  శాఖ నుంచి స్కిల్‌ డెవలెప్‌మెంట్‌ శాఖ అప్పగిం చేందుకు ఏర్పాట్లు చేయాలని రెవెన్యూ అధికారులకు జేసీ  ఆదేశించారు. వంశధార క్వార్టర్స్‌  ఉన్న 4 ఏకరాల్లో   రూ. 40 కోట్లతో వృత్తి నైపుణ్యాభివృద్ధి సంస్ధ కళాశాలను ఏర్పాటు చేసి  నిరుద్యోగులకు వృత్తి పరమైన శిక్షణ ఇవ్వనున్నట్లు చెప్పారు. ఐటీఐ, ఇంజినీరింగ్‌, డిగ్రీలు పూర్తి చేసిన విద్యార్థులకు వృతిపరమైన శిక్షణ ఇచ్చి ఉపాధి అవకాశాలను కల్పించడమే  సంస్థ ఉద్దేశమని  ఉద్దేశ్యమని వృత్తి నైపుణ్యాభివృద్ధి సంస్థ జిల్లా మేనేజర్‌ గోవిందరావు  వివరించారు. కార్యక్రమంలో ఆర్డీవో కిశోర్‌, తహసీల్దార్‌ కె.ప్రవల్లిక ప్రియ, వంశధార ఏఈ సురేష్‌ తదితరులు ఉన్నారు.

Advertisement
Advertisement
Advertisement