Abn logo
May 6 2021 @ 21:36PM

ఇంటింటి రేషన్‌ పంపిణీ వ్యవస్థ విఫలం!

వాకాడు, మే 6 : కోట్లు ఖర్చుపెట్టి అమలు చేస్తున్న ఇంటింటి రేషన్‌ బియ్యం పథకం  ఎవరికి ఉపయోగపడని పరిస్థితి నెలకొంది. నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం మాటేమే గానీ, డీలర్లకు ఉపాధి లేకుండా పోవడంతో పాటు, లబ్ధిదారుల ఇళ్లవద్దకు రేషన్‌ అనే లక్ష్యం నీరుగారిపోయింది.   మండలంలో 12,316 బియ్యం కార్డులు ఉండగా 8 రూట్లుగా విభజించి వాహనాలు ఏర్పాటు చేశారు. మే, జూన్‌ నెలల్లో ఒకరికి 10 కిలోల చొప్పున బియ్యం ఇవ్వాల్సి ఉండగా, ఇప్పటి వరకు ఆ మేరకు చర్యలే ప్రారంభం కాలేదు.    ఇకనైనా  ప్రజలకు ఉపయోగపడేలా చర్యలు చేపడితే ఉపయోగంగా ఉంటుందని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. మునపటిలా రేషన్‌ దుకాణంలోనే సరుకులు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.


Advertisement