Home » Ladakh
లద్దాఖ్‌లో హింసాత్మక ఘటనల అనంతరం జాతీయ భద్రతా చట్టం(NSA) కింద అరెస్టయిన వాంగ్‌చుక్ ప్రస్తుతం రాజస్థాన్‌లో జోథ్‌పూర్ జైలులో ఉన్నారు. వాంగ్చుక్ను ఆయన అన్నయ్య డోర్జీ లే, న్యాయవాది ముస్తఫా హజి కలుసుకున్నారు.
పాకిస్థాన్‌తో సంబంధాలున్నాయనే తప్పుడు ఆరోపణలతో తన భర్తను అరెస్టు చేసినట్టు గీతాంజలి ఆరోపించారు. జాతీయ భద్రతా చట్టం కింద తన భర్తను ఎందుకు అరెస్టు చేశారో చెప్పాలని ఆమె ప్రశ్నించారు.
లెహ్‌లో సోమవారంనాడు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో లెహ్ అపెక్స్ బాడీ చైర్మన్ తుప్స్తాన్ ఛెవాంగ్ మాట్లాడారు. లద్దాఖ్‌లో నెలకొన్న పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని అక్కడ శాంతియుత పరిస్థితి నెలకొనేంత వరకూ ఎలాంటి చర్చల్లోనూ పాల్గొనరాదని తామంతా ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు.
లద్దాఖ్‌కు రాష్ట్ర హోదా కల్పించాలనే డిమాండ్‌లో గతవారంలో లెహ్‌లో చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. వాంగ్‌చుక్ తన ప్రసంగాలతో హింసను రెచ్చగొట్టారని ప్రభుత్వం ఆరోపిస్తోంది. ప్రస్తుతం ఆయన జోథ్‌పూర్ జైలులో ఉన్నారు.
వాంగ్‌చుక్ ఏళ్ల తరబడి శాంతియుత నిరసనలు తెలుపుతున్నారని, అయితే సీఆర్పీఎఫ్ చర్యలతోనే సెప్టెంబర్ 4న పరిస్థితి ఉద్రిక్తంగా మారి నలుగురి మృతికి దారితీసిందని ఆంగ్మో ఆరోపించారు.
లెహ్‌లో నిరసనలను రెచ్చగొట్టారంటూ వాంగ్చుక్ను జాతీయ భద్రతా చట్టం (NSA)కింద శుక్రవారం నాడు అరెస్టు చేశారు. అనంతరం రాజస్థాన్‌లోని జోథ్‌పూర్ సెంట్రల్ జైలుకు ఆయనను తరలించారు.
షెడ్యూల్ ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటలకు వాంగ్‌చుక్ మీడియా సమావేశంలో మాట్లాడాల్సి ఉండగా, దానికి ముందే ఆయనను కస్టడీలోకి తీసుకున్నారు. లద్దాఖ్‌కు రాష్ట్రహోదా కల్పించాలని, దానిని గిరిజన హక్కుల పరిరక్షణ కోసం రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ వాంగ్‌చుక్ ఉద్యమం సాగిస్తున్నారు.
రాష్ట్రహోదా డిమాండ్‌లో భాగంగా పలువురు కొద్దిరోజులుగా నిరాహార దీక్షలు కొనసాగిస్తుండగా, తమ డిమాండ్లపై ఒత్తిడి తెచ్చేందుకు బుధవారంనాడు లద్దాఖ్ షట్డౌన్కు పిలుపునిచ్చారు.
లద్దాఖ్‌కు రాష్ట్ర హోదా కల్పించి, రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్లో చేర్చాలని వాంగ్‌చుక్ డిమాండ్ చేస్తున్నారు. ఇందువల్ల భూములు, ఉద్యోగాలు, కల్చరల్ ఐడెంటిటీకి పరిరక్షణ లభిస్తుందని అంటున్నారు.
జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కల్పించే ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం 2019 ఆగస్టు 5న రద్దు చేసింది. జమ్మూకశ్మీర్ రాష్ట్రాన్ని జమ్మూకశ్మీర్, లద్దాక్ కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. అప్పట్నించి రాష్ట్ర హోదా పునరుద్ధరణకు డిమాండ్లు వినిపిస్తున్నాయి.