
హక్కుల విషయంలో అన్నిదేశాల కంటే ముందుండే అగ్రరాజ్యం అమెరికా చరిత్రలో చీకటి దినం! ఆ దేశ మహిళలకు ఐదు దశాబ్దాలుగా ఉన్న చట్టబద్ధమైన గర్భస్రావ హక్కును ఆ దేశ సుప్రీంకోర్టు తొలగించింది. దేశవ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ ఆ హక్కును కల్పిస్తూ 50 ఏళ్ల క్రితం వచ్చిన తీర్పును కొట్టేసింది.