desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
వారఫలాలు (జన్మ నక్షత్రం ప్రకారం) (18-10-2020)

మేషం

అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం: అనుకూలతలు అంతంత మాత్రమే. విమర్శలు ఎదుర్కొంటారు. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. ఆశావహ దృక్పథంతో మెలగండి. బుధవారం నాడు ఆప్తుల కలయిక వీలుపడదు. పనులు హడావుడిగా సాగుతాయి. ఖర్చులు విపరీతం. ఈ చికాకులు తాత్కాలికమే. త్వరలో పరిస్థితులు అనుకూలిస్తాయి. శుభకార్యా నికి సన్నాహాలు సాగిస్తారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. దైవదర్శనంలో అవస్థలు తప్పవు.

వృషభం

కృత్తిక 2,3,4; రోహిణి, మృగశిర 1,2 పాదాలు: ప్రేమానుబంధాలు బలపడ తాయి. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. గుట్టుగా వ్యవ హరించండి. బాధ్యతలు అప్పగించవద్దు. ఆదాయం సంతృప్తికరం. పనులు చురుకుగా సాగుతాయి. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. వ్యవహార ఒప్పందాల్లో మెలకువ వహించండి. గురు, శుక్ర వారాల్లో ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. ఆరోగ్యం పట్ల శ్రద్థ అవసరం. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. ప్రత్యర్థులతో జాగ్రత్త.

మిథునం

మృగశిర 3,4; ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు: ధనలాభం ఉంది. ఖర్చులు విపరీతం. అనుకున్నది సాధిస్తారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. పరిచయాలు విస్తరిస్తాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. పనుల ప్రారంభంలో అవాంతరాలు ఎదురవుతాయి. శని, ఆదివారాల్లో ఆలోచనల్లో మార్పు వస్తుంది. మీ జోక్యం అని వార్యం. మీ సలహా ఇరువర్గాలకు ఆమోదయోగ్య మవుతుంది. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది.

కర్కాటకం

పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష: ఈ వారం శుభదాయకమే. జటిలమైన వ్యవహారాలు కొలిక్కివస్తాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలు కలిసి వస్తాయి. పొదుపు ధనం గ్రహిస్తారు. పనుల్లో ఒత్తిడి, జాప్యం అధికం. ఆప్తులకు ముఖ్య సమాచా రం అందిస్తారు.అనవసర బాధ్యతలు చేపట్టి ఇబ్బం దులు ఎదుర్కొంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్థ అవస రం. చిన్ననాటి పరిచయస్తులతో సంభాషిస్తారు. గత సంఘటనలు ఉల్లాసాన్నిస్తాయి.

సింహం

మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం: లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం. గత తప్పిదాలు పునరావృతమవుతాయి. అనుకూల తలు అంతంత మాత్రమే. మీ సమర్థతపై నమ్మకం పెంచుకోండి. సహాయం ఆశించవద్దు. స్వయంకృషి తోనే అనుకున్నది సాధిస్తారు. కొంత మొత్తం ధనం అందుతుంది. అవసరాలు నెరవేరుతాయి. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. అనుకోని సంఘటనలు ఎదుర వుతాయి. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. అనాలోచిత నిర్ణయాలు తగవు. ’’

కన్య

ఉత్తర 2,3,4; హస్త, చిత్త 1,2 పాదాలు: శుభవార్త వింటారు. కష్టం ఫలి స్తుంది. సభ్యత్వాలు స్వీకరిస్తారు. బాధ్యతలు అధిక మవుతాయి. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. సోమ, మంగళవారాల్లో దుబారా ఖర్చులు విపరీతం. డబ్బుకు ఇబ్బంది ఉండదు. పనులు వేగవంతమవు తాయి. గృహం సందడిగా ఉంటుంది. ఇంటి విష యాలపై శ్రద్థ వహిస్తారు. మీ సిఫార్సుతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. పత్రాల రెన్యువల్‌లో మెల కువ వహించండి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది.

తుల

చిత్త 3,4; స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు: లక్ష్యం నెరవేరుతుంది. మంచి పని చేసి ప్రశంసలందుకుంటారు. అందరితో సత్సం బంధాలు నెలకొంటాయి. ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. దైవకార్యాలకు వ్యయం చేస్తారు. బుధవారం నాడు అప్రమత్తంగా ఉండాలి. పత్రాలు, నగదు జాగ్రత్త. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. పనులు ముందుకు సాగవు. ఆప్తుల సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. దైవదర్శనాలు మనశ్శాంతినిస్తాయి.

వృశ్చికం

విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ: వ్యవహారానుకూలత ఉంది. సమయోచితంగా వ్యవహరిస్తారు. భూ సంబంధిత వివాదాలు కొలిక్కివస్తాయి. కొత్త యత్నాలకు శ్రీకా రం చుడతారు. గురు, శుక్రవారాల్లో పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. పరిచయం లేని వారితో జాగ్రత్త. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఖర్చులు అంచనాలను మించుతాయి. డబ్బుకు ఇబ్బంది ఉండదు. బంధుమిత్రులు ధనసహాయం అర్థిస్తారు. వేడుకలు, విందుల్లో పాల్గొంటారు.

ధనుస్సు

మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం: పరిస్థితులు క్రమంగా మెరుగు పడతాయి. వాహనయోగం, వస్త్రలాభం ఉన్నాయి. ఉల్లాసంగా గడుపుతారు. బంధువులతో సత్సంబం ధాలు నెలకొంటాయి. ఖర్చులు విపరీతం. ఆదాయా నికి లోటుండదు. సకాలంలో చెల్లింపులు జరుపు తారు. శని, ఆదివారాల్లో ప్రముఖుల సందర్శనం వీలుపడదు. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. అవగా హన లేని విషయాల్లో జోక్యం తగదు. కనిపించ కుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి.

మకరం

ఉత్తరాషాఢ 2,3,4; శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు: ఆర్థికంగా బాగుంటుంది. ఖర్చులు విపరీతం. ఆత్మీయులకు సాయం అంది స్తారు. గృహం సందడిగా ఉంటుంది. పరిచయాలు, బంధుత్వాలు బలపడతాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. ఒక సమాచారం తీవ్రంగా ఆలోచింపచేస్తుంది. ముఖ్యులతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలకు స్పందన లభి స్తుంది. మంగళ, బుధవారాల్లో పనుల్లో ఒత్తిడి అధికం. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం.

కుంభం

ధనిష్ట 3,4; శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు: ఆశావహ దృక్పథంతో మెల గండి. కార్యసాధనకు ఓర్పు ప్రధానం. స్వయం కృషితోనే అనుకున్నది సాధిస్తారు. ఆంతరంగిక విషయాలు వెల్లడించవద్దు. నమ్మకస్తులే తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. గురువారం నాడు అప్రమత్తంగా ఉండాలి. విలువైన వస్తువులు జాగ్రత్త. పనులు ముగింపు దశలో హడావుడిగా సాగుతాయి. ఖర్చులు విపరీతం. చేతిలో ధనం నిల వదు. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.

మీనం

పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి: ఆర్థికస్థితి నిరాశాజనకం. పురోగతి లేక నిస్తేజానికి లోనవుతారు. సన్నిహితుల హితవు మీపై మంచి ప్రభావం చూపుతుంది. ఉత్సా హంతో ముందుకు సాగుతారు. ఖర్చులు విపరీతం. శనివారం నాడు పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. కుటుంబీకులు మీ అశక్తతను అర్థం చేసుకుంటారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. సోదరులతో సంప్రదింపులు జరుపుతారు. మీ అభిప్రాయాలను స్పష్టంగా వ్యక్తం చేయండి.

Advertisement