desktop_rhs_sticky_ad
desktop_lhs_sticky_ad
Abn logo
శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మరుతువు, ఆషాఢమాసం, బహుళపక్షం; తిథి: విదియ తె. 4.05 తదుపరి తదియ; నక్షత్రం: శ్రవణం ఉ. 11.18 తదుపరి ధనిష్ఠ; వర్జ్యం: మ.3.09-4.42; దుర్ముహూర్తం: సా.5.05-5.56; అమృతఘడియలు: రా.12.25-1.57; రాహుకాలం: సా.4.30-6.00; సూర్యోదయం: 5.57; సూర్యాస్తమయం: 6.48
వారఫలాలు (జన్మ నక్షత్రం ప్రకారం) (27-06-2021)

మేషం

అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం: అవిశ్రాంతంగా శ్రమిస్తారు. కొత్త సమస్యలు ఎదురవుతాయి. తొందర పాటు నిర్ణయాలు తగవు. స్థిమితంగా ఆలోచిస్తే పరిష్కారమార్గం గోచరిస్తుంది. బుధవారం నాడు అప్రమత్తంగా ఉండాలి. అయిన వారి సలహా పాటించండి. పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. ఆప్తులను కలుసుకుం టారు. ఇంటి విషయాలపై శ్రద్థ వహిస్తారు. పిల్లల విషయంలో మంచే జరుగుతుంది.

వృషభం

కృత్తిక 2,3,4; రోహిణి,మృగశిర 1,2 పాదాలు: మీ నమ్మకం వమ్ముకాదు. కొన్ని విషయాలు అనుకున్నట్టే జరుగుతాయి. ఖర్చులు అధికం, సంతృప్తికరం. గురు, శుక్ర వారాల్లో చెల్లింపుల్లో జాగ్రత్త. ఫోన్‌ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ప్రలోభాలకు లొంగవద్దు. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలు చేజారినా ఒకందుకు మంచిదే. విమర్శలకు దీటుగా స్పందిస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. గృహమార్పు కలిసివస్తుంది.

మిథునం

మృగశిర 3,4; ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు: ప్రతికూలతలు అధికం. శ్రమిం చినా ఫలితం ఉండదు. కొంతమంది మీ యత్నాలను నీరుగార్చేందుకు యత్నిస్తారు. మనోధైర్యంతో వ్యవహరించండి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. పెద్ద ఖర్చు తగిలే సూచనలున్నాయి, ధనం మితంగా వ్యయం చేయండి. ఆది, శనివారాల్లో ముఖ్యుల కలయిక వీలుపడదు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి.

కర్కాటకం

పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష: వ్యవహారం బెడిసికొట్టే ఆస్కా రం ఉంది. లౌక్యంగా సమస్యలు పరిష్కరిం చుకోవాలి. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. ఆదాయం సంతృప్తికరం. ఖర్చులు భారమనిపించవు. సోమ, మంగళవారాల్లో అపరిచితులతో జాగ్రత్త. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. ఇంటి విషయాలపై మరింత శ్రద్థ అవసరం. బంధుమిత్రులతో విభేదాలు తలెత్తుతాయి. పెద్దల సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది.

సింహం

మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం: ఆదాయవ్యయాలకు పొంతన ఉండదు. సాయం అర్థించి భంగపడతారు. అవసరాలు అతికష్టంమ్మీద నెరవేరుతాయి. బాధ్యతలు అప్పగించవద్దు. పట్టుదలతో శ్రమిం చినా పనులు పూర్తి కావు. బుధ, గురు వారాల్లో ఊహించని సంఘటనలు ఎదురవు తాయి. ఆత్మీయులతో సంప్రదింపులు జరుపు తారు. ఒక సమాచారం ఉల్లాసాన్నిస్తుంది. పిల్లల ఉన్నత చదువులపై దృష్టి పెడతారు. గృహమార్పు నిదానంగా ఫలితమిస్తుంది.

కన్య

ఉత్తర 2,3,4; హస్త, చిత్త 1,2 పాదాలు: చిత్తశుద్థిని చాటుకుంటారు. ప్రతికూలతలు తొలుగుతాయి. ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. ఉల్లాసంగా గడుపుతారు. ఖర్చులు అధికం, డబ్బుకు ఇబ్బంది ఉండదు. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. శుక్ర, శనివారాల్లో పనుల్లో అవాంతరాలు ఎదురవుతాయి. మీపై శకునాల ప్రభావం అధికం. పట్టుదలతో యత్నాలు సాగించండి. మీ జోక్యం అనివార్యం. ఆప్తులకు చక్కని సలహాలిస్తారు.

తుల

చిత్త 3,4; స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు: సమర్థతకు నిదానంగా గుర్తింపు లభిస్తుంది. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుం టాయి. పొదుపు మూలధనం అందుకుం టారు. ఆది, సోమవారాల్లో పనులు మంద కొడిగా సాగుతాయి. ఒక ఆహ్వానం ఆలోచింప చేస్తుంది. సామరస్యంగా సమస్యలు పరిష్క రించుకోవాలి. పిల్లల చదువులపై దృష్టి పెడ తారు. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. విదేశీయాన యత్నాలు విరమించుకుంటారు.

వృశ్చికం

విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ: ప్రతికూలతలు తొలగుతాయి. త్వరలో మీ కృషి ఫలిస్తుంది. ఆదాయం సంతృప్తికరం. కొన్ని ఇబ్బందుల నుంచి బయ టపడతారు. గృహం ప్రశాంతంగా ఉంటుంది. పనులు వేగవంతమవుతాయి. ఇంటి విషయా లపై శ్రద్థ వహించండి. విలువైన వస్తువులు జాగ్రత్త. మంగళ, బుధవారాల్లో అనవసర జోక్యం తగదు. ఆప్తుల కలయిక ఉత్తేజాన్ని స్తుంది. పత్రాల రెన్యువల్‌లో మెలకువ వహించండి. కొత్త పరిచయాలేర్పడతాయి.

ధనుస్సు

మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం: ఈ వారం నిరాశాజనకం. ప్రతి చిన్న విషయానికీ ఆందోళన చెందుతారు. రుణ ఒత్తిళ్లు అధికమవుతాయి. సన్నిహితుల సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. పెద్దల సలహా పాటిస్తారు. మనస్సు కుదుటపడుతుంది. ఖర్చులు విపరీతం. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. పిల్లల విషయంలో శుభఫలితాలున్నాయి. ఆహ్వానం అందుకుంటారు.

మకరం

ఉత్తరాషాఢ 2,3,4; శ్రవణం, ధనిష్ట 1,2 పాదాలు: ఆశావహ దృక్పథంతో మెల గండి. ఏ విషయాన్నీ తీవ్రంగా పరిగణించ వద్దు. సోదరులతో సంప్రదింపులు జరుపు తారు. అనాలోచిత నిర్ణయాలు తగవు. పెద్దల సలహా పాటించండి. ఖర్చులు అంచనాలను మించుతాయి. రుణాలు చేబదుళ్లు స్వీకరి స్తారు. గృహమార్పు అనివార్యం. పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. పిల్లల పై చదువులను వారి ఇష్టానికే వదిలేయండి.

కుంభం

ధనిష్ట 3,4; శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు: పట్టుదలతో ముందుకు సాగండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. ఆదా యానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. ధన సహాయం తగదు. మీ గురు, శుక్రవారాల్లో పనుల్లో అవాంతరాలు ఎదురవుతాయి. ఆలోచనలతో సతమతమవుతారు. వ్యాపకాలు సృష్టించుకోవటం ఉత్తమం. పత్రాల రెన్యు వల్‌లో మెలకువ వహించండి. గృహ మరమ్మతులు చేపడతారు. చిన్ననాటి పరిచ యస్తులను కలుసుకుంటారు.

మీనం

పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి: మీ కష్టం ఫలిస్తుంది. రావల సిన ధనం అందుతుంది. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. పనులు వేగవంతమవు తాయి. ఆప్తులకు ముఖ్య సమాచారం అందిస్తారు. బుధ, శనివారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. పనివారల వైఖరి అసహనం కలిగిస్తుంది. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోండి. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. బంధు మిత్రుల రాకపోకలు అధికమవుతాయి.

Advertisement