టీజేఎస్ లక్ష్యం నెరవేరేనా..? టీఆర్ఎస్‌ను గద్దె దించేనా..?
తెలంగాణ ఉద్యమ సమయంలో కలిసి పనిచేసిన కేసీఆర్‌తో.. ప్రస్తుతం కోదండరాం వైరం పెట్టుకున్నారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం పనిచేయడం లేదంటూ విమర్శలు గుప్పించడంతో టీఆర్ఎస్ సర్కారు ఆయనపై తీవ్రంగా ఎదురుదాడి చేస్తోంది. ‘వార్డు మెంబర్‌గా కూడా గెలవనోడు’ అంటూ ఏకంగా సీఎం కేసీఆరే విమర్శలు చేశారు. మొత్తానికి ఉద్యమ పంథా నుంచి రాజకీయ రంగ ప్రవేశం చేసి.. ‘తెలంగాణ జన సమితి’తో ప్రజల ముందుకు వస్తున్నారు. కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ పార్టీలతో కలిసి మహాకూటమిలో భాగస్వాములయ్యారు. టీఆర్ఎస్ సర్కారును గద్దె దించాలన్న ఏకైక లక్ష్యంతో ఆయన ముందుకు సాగుతున్నారు. పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు, ఉద్యమకారులు కోదండరాంకు మద్ధతుగా ఉండటం గమనార్హం. ఈ మద్ధతును టీజేఎస్ ఓట్లుగా మలుచుకోగలదా..? కాంగ్రెస్‌ను గెలిపించి ప్రభుత్వంలో భాగస్వామి అవుతుందా..? టీఆర్ఎస్ గెలుపునకు పరోక్షంగా కారణమవుతుందా..? అనేది కొద్ది రోజుల్లోనే తేలనుంది.
ADVT

ADVT
కోదండరాంది ఆదిలాబాద్‌. తండ్రి ఫారెస్టు కాంట్రాక్టులు చేసేవారు. అదిలాబాద్ జిల్లాలో జన్మించినప్పటికీ ఆయన వరంగల్ జిల్లాలోనే చదువుకున్నారు. చిన్నప్పటి నుంచే తెలంగాణ ఉద్యమాలలో కోదండరాం పాల్గొనేవారు. 1969లో వరంగల్ జిల్లాలో తెలంగాణ పోరాటంలో ఆయన చురుకుగా పాల్గొన్నారు. తొలి దశలో సంప్రదాయ ఆలోచనలతో ఉండేవారు. 1970ల నాటి కల్లోల దశాబ్దం ఆయనను ఆలోచింపజేసింది. 1972-75 మధ్యకాలంలో ఆయన డిగ్రీలో ఉండగా..ఇందిరాగాంధీ భూ సంస్కరణలు, బ్యాంకుల జాతీయీకరణ వంటి చర్యలు తీసుకున్నారు. ఎమర్జెన్సీ పెట్టారు. అతి పెద్ద ప్రజాస్వామ్యం అనుకున్న దేశంలో..ఎమర్జెన్సీ విధించడం ఏమిటని దిగ్ర్భాంతికి గురయ్యారాయన. ఈ క్రమంలో పౌర హక్కుల ఉద్యమానికి ఆకర్షితుడినయ్యారు. ఉస్మానియా యూనివర్శిటీ పొలిటికల్ సైన్స్‌లో ఎమ్.ఏ చేయడానికి 1976లో ఆయన మొదటిసారిగా హైదరాబాద్ వచ్చారు. ఎమ్.ఏ పూర్తిచేసిన తరువాత పొలిటికల్ సైన్స్‌లోనే ఎమ్‌.ఫిల్ చేయడానికి ఆయన ఢిల్లీ వెళ్లారు. ఆ తరువాత మళ్లీ హైదరాబాద్ తిరిగొచ్చి యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్‌లో రీసెర్చ్ స్కాలర్‌గా, ఉస్మానియాలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేరారు. పొలిటికల్ సైన్స్‌లో ప్రొఫెసర్‌గా మంచి గుర్తింపు పొందిన ఆయన ఉస్మానియా నుంచి ప్రొఫెసర్‌గానే పదవీ విరమణ చేశారు. ఆయన పిల్లలిద్దరూ అమెరికాలోనే ఉన్నారు. అమ్మాయి..నల్లగొండ అబ్బాయిని ప్రేమ పెళ్లి చేసుకుంది.
  • నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ప్రతినిధి.. అంటూ ఉద్యమ సమయంలో కోదండరాంను కేసీఆర్ పొగిడారు. ఇప్పుడు అదే కేసీఆర్ ‘కనీసం సర్పంచ్‌గా కూడా గెలవని వ్యక్తి’.. అంటూ ఆయనను విమర్శిస్తున్నారు. ఉద్యమ సమయంలో కలిసి మెలిగిన వీరిద్దరికీ.. రాష్ట్ర ఏర్పాటు అనంతరం, టీఆర్ఎస్ సర్కారు ఏర్పడ్డాక ఏ కారణం వల్లనో విబేధాలు వచ్చాయి. 
  • సామాన్య జనంలో ఇట్టే కలిసిపోతారు. ఉద్యమ సమయంలో ఎక్కడికెళ్లినా కోదండరాంకు ప్రజలు నీరాజనాలు పట్టారు. ఇళ్లల్లోకి పిలిచి బోజనాలు పెట్టారు. 
  • ఎంపీ సీటు ఇస్తా పోటీ చేయమని కేసీఆర్ ఆఫరిచ్చినా తిరస్కరించానని కోదండరాం చెబుతుంటారు. 
  • పాత సినిమాలు చూస్తాను. రిలీఫ్‌ కోసం టీవీ చూస్తాను. పుస్తకాలు చదువుతాను. మొక్కలు పెంచడం ఇష్టం