Advertisement
Advertisement

ఆంధ్రజ్యోతి జర్నలిజం కళాశాల... దరఖాస్తులకు ఆహ్వానం

అర్హతలు 

 • ఇంగ్లీషు భాషలో వ్యవహారజ్ఞానం, తెలుగులోకి అనువాదం చేయగలిగిన నైపుణ్యం
 • వర్తమాన వ్యవహారాలపై అవగాహన, విశ్లేషణా సామర్థ్యం
 • సరళమైన తెలుగులో రాయగలగడం
 • చక్కటి భావవ్యక్తీకరణ, డిగ్రీ ఉత్తీర్ణత, 35 సంవత్సరాలకు మించని వయస్సు

దరఖాస్తు విధానం

 • మీలో పై అర్హతలన్నీ ఉంటే పూర్తి వివరాలతో దరఖాస్తు చేయాలి. https://andhrajyothy.com/ajsj నుంచి డౌన్‌లోడ్‌ చేసుకున్న దరఖాస్తు ఫారంను మాత్రమే పూర్తిగా నింపి పంపాలి. 
 • దరఖాస్తుకు సర్టిఫికెట్ల జిరాక్స్‌ ప్రతులు, ఇటీవల తీసుకున్న రెండు ఫొటోలు జతపరచాలి. 
 • దరఖాస్తులోను, కవరుపైన మీ పూర్తి చిరునామా, మొబైల్‌ నెంబర్‌, ఈ-మెయిల్‌, పరీక్ష  రాయదలచుకున్న కేంద్రం స్పష్టంగా రాయాలి. 
 • రాతపరీక్ష, ఇంటర్వ్యూ వివరాలు ఫోన్‌ ద్వారా మాత్రమే తెలియపరుస్తాం. అందువల్ల మీరు ఎప్పుడూ అందుబాటులో ఉండే మొబైల్‌ నెంబర్‌నే దరఖాస్తులో ఇవ్వాలి.యువతరం భవిష్యత్తుపై కోవిడ్ మహమ్మారి చూపించే ప్రభావాన్ని విశ్లేషిస్తూ సొంతంగా రాసిన వ్యాసాన్ని దరఖాస్తుకు తప్పనిసరిగా జత చేయాలి. వ్యాసం లేని దరఖాస్తులను పరిశీలించం. 


ఎంపిక

 • అభ్యర్థుల ఎంపిక రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది. 
 • రాతపరీక్షలో వర్తమాన వ్యవహారాలు, తెలుగు భాష, సాహిత్యం, అనువాద సామర్థ్యంపై ప్రశ్నలుంటాయి.
 • అభ్యర్థుల ఎంపికలో ఆంధ్రజ్యోతి యాజమాన్యానిదే తుది నిర్ణయం. 
 • శిక్షణకు ఎంపికైన అభ్యర్థులు కనీసం మూడు సంవత్సరాలు పని చేస్తామని హామీపత్రం ఇవ్వాలి.

శిక్షణ 

 • ఎంపిక చేసిన అభ్యర్థులకు ఆంధ్రజ్యోతి జర్నలిజం కళాశాలలో  ఆరు నెలల శిక్షణ ఉంటుంది. 
 • భాష, భావవ్యక్తీకరణ, వర్తమాన వ్యవహారాలపై అవగాహన, అనువాదం, ఎడిటింగ్‌లలో శిక్షణ ఉంటుంది. 
 • శిక్షణ విజయవంతంగా ముగించుకున్నాక ట్రైనీ ఉద్యోగులుగా అవకాశం లభిస్తుంది. 
 • వీరు హైదరాబాద్‌లోనే పని చేయడానికి సిద్ధంగా ఉండాలి. 


శిక్షణానంతరం ముఖ్య విభాగాల్లో పని చేయగల నైపుణ్యం సాధించలేని వారిని కొంత తక్కువ వేతనంతో ఇతర విభాగాలలోకి తీసుకునే అవకాశం ఉంటుంది.


పరీక్షా కేంద్రాలు

హైదరాబాద్‌, వరంగల్‌, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి 


వేతనం

శిక్షణ కాలంలో నెలకు రూ. 12,000; శిక్షణానంతరం రూ. 20,000 


దరఖాస్తులు చేరాల్సిన ఆఖరి తేదీ: 2022, జనవరి 22

దరఖాస్తులు పంపవలసిన చిరునామా

ప్రిన్సిపాల్‌, ఆంధ్రజ్యోతి జర్నలిజం కళాశాల, ఆంధ్రజ్యోతి బిల్డింగ్స్‌, ప్లాట్‌ నెం. 76, జూబ్లీహిల్స్‌ రోడ్డు నం. 70,  హైదరాబాద్‌ - 500 110 

Application డౌన్‌లోడింగ్ లింక్...

Model Paper డౌన్‌లోడింగ్ లింక్...