లక్ష్మీనృసింహుడి దర్శనానికి లక్షకు పైగా భక్తులు
ABN , Publish Date - Jun 15 , 2026 | 04:10 AM
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. వేసవి సెలవులు ముగియడం, ఆదివారం సెలవు దినం కావడంతో నృసింహుడిని...
సెలవులు ముగియటం, వారాంతం కావటంతో రద్దీ
స్వామివారిని దర్శించుకున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి
యాదగిరిగుట్ట, బాసర, జూన్ 14 (ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దివ్యక్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. వేసవి సెలవులు ముగియడం, ఆదివారం సెలవు దినం కావడంతో నృసింహుడిని దర్శించుకునేందుకు సుమారు 1.15 లక్షల మంది భక్తులు తరలివచ్చారు. ప్రత్యేక దర్శనానికి గంట, ధర్మదర్శనానికి 3గంటల సమయం పట్టింది. ఆలయ ఖజానాకు వివిధ విభాగాల ద్వారా రూ.71,70,892 ఆదాయం సమకూరినట్లు ఈవో జే.భవానీశంకర్ తెలిపారు. మరోవైపు లక్ష్మీనృసింహుడిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పమిడిఘంటం నరసింహ దర్శించుకున్నారు.
బాసరకు పోటెత్తిన భక్తులు
నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయం భక్తులతో పోటెత్తింది. తెలుగు రాష్ర్టాలతో పాటు పొరుగున ఉన్న మహారాష్ట్ర నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. రద్దీ కారణంగా దర్శనం, పూజల కోసం సుమారు 3గంటల సమయం పట్టింది. ఆలయంలోని అక్షరాభ్యాస మండపాల్లో పెద్ద సంఖ్యలో చిన్నారులకు అక్షరాభ్యాస వేడుకలు ఘనంగా నిర్వహించారు.
