Share News

గణనీయంగా పెరిగిన పర్యాటకులు: జూపల్లి

ABN , Publish Date - Jun 14 , 2026 | 04:59 AM

తెలంగాణలో పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగిందని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. 2023లో 5.84 కోట్లుగా ఉన్న దేశీయ పర్యాటకుల ...

గణనీయంగా పెరిగిన  పర్యాటకులు: జూపల్లి

హైదరాబాద్‌, జూన్‌ 13 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగిందని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. 2023లో 5.84 కోట్లుగా ఉన్న దేశీయ పర్యాటకుల సంఖ్య 2024లో రికార్డు స్థాయిలో 8.82 కోట్లకు చేరిందన్నారు. విదేశీ పర్యాటకుల సంఖ్య 2024తో పోలిస్తే 2025లో 10 శాతానికి పైగా పెరిగిందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పర్యాటక, సాంస్కృతిక, వారసత్వ రంగాల్లో సాధించిన ప్రధాన విజయాలను మంత్రి ఒక ప్రకటనలో వెల్లడించారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారిగా తెలంగాణ టూరిజం పాలసీ 2025-2030ను అమలు చేశామని పేర్కొన్నారు. ఈ విధానం ద్వారా రూ.15 వేల కోట్ల పెట్టుబడులు, 3 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. టూరిజం కాన్‌క్లేవ్‌-2025తోరూ.15,285 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చాయని, తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌-2025లో రూ.8,456 కోట్ల విలువైన అవగాహన ఒప్పందాలు కుదిరాయని చెప్పారు.

Updated Date - Jun 14 , 2026 | 04:59 AM