Share News

CAG: రాష్ట్ర రాబడి 1,90,876 కోట్లు

ABN , Publish Date - Jan 20 , 2026 | 02:31 AM

రాష్ట్ర ప్రభుత్వానికి గత డిసెంబరు నాటికి అన్ని రకాల రాబడుల కింద రూ.1,90,876.51 కోట్ల ఆదాయం సమకూరింది.

CAG: రాష్ట్ర రాబడి 1,90,876 కోట్లు

  • డిసెంబరు నాటికి సమకూరిన సొమ్ము ఇది

  • ఆదాయ, వ్యయాల నివేదిక విడుదల చేసిన కాగ్‌

హైదరాబాద్‌, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వానికి గత డిసెంబరు నాటికి అన్ని రకాల రాబడుల కింద రూ.1,90,876.51 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ ఆర్థిక సంవత్సరం(2025-26)లో నిర్దేశించుకున్న రాబడుల మొత్తం రూ.2,84,837.30 కోట్లలో ఇది 67.01 శాతంగా నమోదైంది. ఈ మేరకు ‘కంపో్ట్రలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌)’ సోమవారం రాష్ట్ర రాబడులు, వ్యయాలకు సంబంధించిన డిసెంబరు నెల నివేదికను విడుదల చేసింది. మొత్తం రాబడుల్లో రెవెన్యూ రాబడుల కింద రూ.2,29,720.63 కోట్లను అంచనా వేయగా.. డిసెంబరు నాటికి రూ.1,24,911.19 కోట్లు (54.38ు) వచ్చాయి. ఇందులో జీఎ్‌సటీ కింద రూ.39,004.84 కోట్లు, స్టాంపులు-రిజిస్ట్రేషన్ల కింద రూ.11,304.19 కోట్లు, సేల్స్‌ ట్యాక్స్‌ కింద రూ.25,126.51 కోట్లు, రాష్ట్ర ఎక్సైజ్‌ సుంకాల ద్వారా రూ.17,507.01 కోట్లు, కేంద్ర పన్నుల్లో వాటా కింద రూ.14,982.82 కోట్లు, ఇతర పన్నులు, సుంకాల ద్వారా రూ.6,059.20 కోట్లు, పన్నేతరాల కింద రూ.7,120.53 కోట్లు, కేంద్ర గ్రాంట్లు-కాంట్రిబ్యూషన్ల కింద రూ.3,805.59 కోట్లు సమకూరాయి. అయితే.. పన్నేతర రాబడుల కింద డిసెంబరులో ఏకంగా రూ.2,350.34 కోట్లు రావడం గమనార్హం. ఏపిల్ర్‌ నుంచి ఇప్పటివరకు ఈ నెలలోనే ఎక్కువ రాబడి వచ్చింది. భూముల అమ్మకం ద్వారానే ఈ పన్నేతర రాబడి ఎక్కువగా వచ్చిందని చెప్పవచ్చు. కాగా, మూలధన రాబడుల్లో భాగంగా ప్రభుత్వం రూ.65,930.31 కోట్ల అప్పులను సేకరించింది. ఈసారి రూ.54,009.74 కోట్ల అప్పు తీసుకోవాలని నిర్ణయించగా.. డిసెంబరు నాటికి ప్రభుత్వం 122.07శాతం అప్పులు తీసుకుంది. మొత్తం రూ.1,77,204.16 కోట్లను వ్యయం చేసింది. ఇది నిర్దేశించుకున్న లక్షిత వ్యయం రూ.2,63,486.73 కోట్లలో 67.25 శాతంగా నమోదైంది. ఇందులో ప్రధానంగా పథకాలు, కార్యక్రమాల కోసం రూ.52,556.81 కోట్లు, వడ్డీ చెల్లింపులకు రూ.21,454.17 కోట్లు, ఉద్యోగుల జీత భత్యాలకు రూ.35,746.99 కోట్లు, పెన్షన్ల కింద రూ.14,126.99 కోట్లు, సబ్సిడీలకు రూ.10,627.25 కోట్లను వ్యయం చేసింది.

Updated Date - Jan 20 , 2026 | 02:31 AM