kumaram bheem asifabad- నైరుతి సందిగ్ధ స్థితి
ABN , Publish Date - Jun 09 , 2026 | 10:09 PM
ఎప్పటిలాగానే ఈ ఏడాది కూడా వర్షాకాలంలో ఆశించిన మేరకు వర్షాలు పడతాయని భావిస్తున్న రైతులను ఎలినినో భయభ్రాంతులకు గురిచేస్తున్నది. ఈ ఏడాది ఆశించిన మేరకు వర్షాలు పడవని, వరి లాంటి పం టలను సాగు చేయడం కష్టమని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ వానాకాలంలో సుమారు 4.50 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయనున్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అందులో పత్తి 3,70,919ఎకరాలు, వరి 42,228ఎకరాలు, కంది 20,817ఎకరాలు, సోయా 1326ఎకరాలు, మొక్కజొన్న 668ఎకరాలు, 11,254ఎకరాల్లో ఇతర పంటలను సాగు చేయనున్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అయితే ప్రస్త్తుం అన్నిచోట్ల రైతులు పొలాలు శుభ్రం చేసి తాము వేయాలనుకున్న పంటలకు అనుగుణంగా దుక్కులు దున్నుకొని పొలాలను సిద్ధం చేసుకుంటున్నారు.
- వర్షాల కోసం రైతుల ఎదురుచూపు
- 40 డిగ్రీలపైనే నమోదవుతున్న ఎండలు
- గతం కంటే భిన్నంగా ఉందంటూ నిరుత్సాహం
- ఎల్‌నినో నేపథ్యంలో వానాకాలం సాగుపై గందరగోళం
బెజ్జూరు, జూన్ 9 (ఆంధ్రజ్యోతి): ఎప్పటిలాగానే ఈ ఏడాది కూడా వర్షాకాలంలో ఆశించిన మేరకు వర్షాలు పడతాయని భావిస్తున్న రైతులను ఎలినినో భయభ్రాంతులకు గురిచేస్తున్నది. ఈ ఏడాది ఆశించిన మేరకు వర్షాలు పడవని, వరి లాంటి పం టలను సాగు చేయడం కష్టమని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ వానాకాలంలో సుమారు 4.50 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయనున్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అందులో పత్తి 3,70,919ఎకరాలు, వరి 42,228ఎకరాలు, కంది 20,817ఎకరాలు, సోయా 1326ఎకరాలు, మొక్కజొన్న 668ఎకరాలు, 11,254ఎకరాల్లో ఇతర పంటలను సాగు చేయనున్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అయితే ప్రస్త్తుం అన్నిచోట్ల రైతులు పొలాలు శుభ్రం చేసి తాము వేయాలనుకున్న పంటలకు అనుగుణంగా దుక్కులు దున్నుకొని పొలాలను సిద్ధం చేసుకుంటున్నారు. గతేడాది మే నెల చివరిలోనే నైరుతి ప్రవేశించడంతో జూన్ నెలలో కురవాల్సిన వర్షాలు కురవడంతో ముందస్తుగానే వానాకాలం పంటల కింద రైతులు సాగు మొదలు పెట్టారు. పత్తి, మొక్కజొన్న, పెసర తదితర పంటల విత్తనాలు వేయడంతో పాటు వరి నారుమళ్లు కూడా పోశారు. కానీ ఈ సారి నైరుతి రుతుపవనాల రాకలో జాప్యం జరుగుతుండటంతో కాలం వెనక్కి పోతోందన్న ఆందోళన రైతుల్లో కనిపిస్తోంది. గతేడాది వానాకాలంలో ప్రారంభంలో కొంతమేర వర్షాలు కురిసి ఆ తర్వాత ముఖం చాటేశాయి. ఆ తర్వాత రెండు నెలల వరకు సాదారణ వర్షాలు కురిసి ఒక్కసారిగా అతివృష్టిగా కురిసింది. అయితే జిల్లాలో ఇప్పటి వరకు పెద్దగా వర్షాలు కురవలేదు. ఇల్లాలో కొన్ని ప్రాంతాల్లో మే చివరలోనే పత్తి విత్తనాలు వేస్తుంటారు. అయితే ఈ సారి అనుకూలమైన వర్షాలు కురవని కారణంగా విత్తుకోలేదు.
- అన్నదాతల్లో కలవరం..
నైరుతి రుతుపవనాలు రాకపోవడం, ఇంకా వర్షా లు కురవకపోవడం, వాతావరణం చల్లబడకపోవ డంతో అన్నదాతల్లో కలవరం మొదలైంది. ఇదే సమయంలో ఈ సారి సూపర్ ఎల్‌నినో ఉంటుం దని, తీవ్ర వర్షాభావం తలెత్తనుందని వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు జారీ చేయడంతో రైతుల్లో ఆందోళన తీవ్రంగా కనిపిస్తోంది. ఈ నేప థ్యంలో ఈసారి వర్షాభావ పరిస్థితులు ప్రమాద సంకేతాలు కనిపిస్తుండడంతో ప్రభుత్వం, వ్యవసా య శాఖ, హార్టికల్చర్, ఇరిగేషన్ అధికారులు ప్రత్యామ్నాయ ప్రణాళికపై దృష్టి సారించారు. వరికి ప్రత్యామ్నాయంగా అరుతడి పంటలకు కావాల్సిన విత్తనాలు సిద్ధం చేస్తున్నారు. జూలై చివ రి వారం, ఆగస్టు నాటికి వర్షాలు అనుకున్న విధంగా కురవకపోతే చెరువులు, ప్రాజెక్టులు నిండని పక్షంలో అరుతడి కింద మొక్కజొన్న, కంది, పెసర, మినుములతో పాటు కూరగాయలు, ఆకు కూరలు తదితర పంటల సాగుకు ముందు జాగ్ర త్తగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
- ఇంకా తగ్గని ఎండల తీవ్రత..
జూన్ రెండో వారం వచ్చినా ఇంకా ఎండల తీవ్రత తగ్గడం లేదు. ఇప్పటికి జిల్లాలో 40డిగ్రీల ఉష్టోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో వానల జాడ లేదు. తొలకరి పలకరించని కారణం గా రైతన్నలు వరణుడి రాకకోసం ఎదురుచూస్తు న్నారు. గతేడాది ఈ పాటికే జిల్లాలో పత్తి విత్తనాలు విత్తుకున్నారు. అయితే ఈసారి మాత్రం పొలాలు దుక్కులు దున్ని సిద్ధం చేసుకొని వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. అయితే వ్యవసాయ అధికారులు మాత్రం ఒకటి, రెండు వర్షాలకు విత్తనాలు విత్తుకోవద్దని చెబుతున్నారు. ఎల్‌నినో ప్రభావం ఏమేరకు ఉంటుందో తెలియని పరిస్థితు లు ఉండడంతో రైతులు కొన్ని రోజులు వేచి చూడాలని చెబుతున్నారు.