Maoists: మావోయిస్టులు అమర్చినప్రెషర్ బాంబ్ పేలి యువకుడి మృతి
ABN , Publish Date - Jan 20 , 2026 | 01:46 AM
మావోయిస్టులు అమర్చిన ప్రెషర్ బాంబ్ పేలి ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా కస్తూరిపాడు అడవుల్లో చోటు చేసుకుంది.
ఛత్తీస్‌గఢ్లోని కస్తూరిపాడు అడవుల్లో ఘటన
చర్ల, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): మావోయిస్టులు అమర్చిన ప్రెషర్ బాంబ్ పేలి ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా కస్తూరిపాడు అడవుల్లో చోటు చేసుకుంది. కస్తూరిపాడు గ్రామానికి చెందిన కుర్రం ఐత (20) ఆదివారం సాయంత్రం కట్టెల కోసం సమీప అడవిలోకి వెళ్లాడు. ఈ క్రమంలో పోలీసులే లక్ష్యంగా మావోయిస్టులు అమర్చిన ప్రెషర్‌బాంబుపై ఐత కాలు వేశాడు. అది ఒక్కసారిగా పేలడంతో అతడి రెండు కాళ్లు పూర్తిగా తెగిపడ్డాయి. విషయం తెలుసుకున్న గ్రామస్థులు యువకుడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. కాగా, కొంతకాలంగా బీజాపూర్ జిల్లా అడవుల్లో ప్రెషర్ బాంబులు పేలి అనేక మంది మృతి చెందారు. మరి కొందరు కాళ్లు కోల్పోయారు. మరోఘటనలో, ఛత్తీ్‌సగఢ్ రాష్ట్రం నారాయణపుర్ జిల్లాలో సోమవారం మావోయిస్టుల డంప్‌ను కేంద్ర బలగాలు గుర్తించాయి. భూమిలో పాతి పెట్టిన డంప్‌లో సుమారు 80 కిపైగా బీజీఎల్స్ లాంచర్లు, ఇతర పేలుడు పదార్థాలున్నట్లు పోలీసులు తెలిపారు.