నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు
ABN , Publish Date - Jun 09 , 2026 | 11:36 PM
రైతుల శ్రేయస్సుకు ఫెస్టిసైడ్ డీలర్లు కట్టుబడి ఉండాలని, వ్యవసాయశాఖ అధికారులు ఫార్మర్ రిజిస్ట్రీని వేగవంతం చేసేందుకు చిత్తశుద్ధితో పనిచేయాలని కలెక్టర్ రిజ్వాన్‌బాషా షేక్ అన్నారు.
డీలర్లను హెచ్చరించిన జోగుళాంబ గద్వాల కలెక్టర్ రిజ్వాన్‌బాషా షేక్
గద్వాల న్యూటౌన్, జూన్ 9 (ఆంధ్రజ్యోతి): రైతుల శ్రేయస్సుకు ఫెస్టిసైడ్ డీలర్లు కట్టుబడి ఉండాలని, వ్యవసాయశాఖ అధికారులు ఫార్మర్ రిజిస్ట్రీని వేగవంతం చేసేందుకు చిత్తశుద్ధితో పనిచేయాలని కలెక్టర్ రిజ్వాన్‌బాషా షేక్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో జిల్లాలోని ఫెస్టిసైడ్స్ దుకాణాల డీలర్లు, సంబంధిత వ్యసాయ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం వ్యవసాయ శాఖకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని, డీలర్లు, అధికారు ల కారణంగా రైతులకు ఏ చిన్న సమస్య వచ్చిన సహించేది లేదన్నారు. ఫెయిల్ అయినా, విడిగా ఉండే, గడువు ముగిసిన విత్తనాలను విక్రయిస్తే చర్యలు తప్పవన్నారు. ప్రతీ పెస్టిసైడ్ దుకాణా ల వద్ద సంబంధిత డీలర్లు స్టాక్, ధరల పట్టిక, తదితర వివరాలను విధిగా ప్రదర్శించాలన్నారు. విత్తనాలు, ఎరువులు అమ్మేందుకు కొత్తగా లైసెన్స్ తీసుకునేవారు, రెన్యువల్ చేసుకోవాల్సిన డీ లర్లు నిబంధనలను పాటించాలన్నారు. యూరియా కొరత, కాంపెక్స్ ఎరువుల ధరలు పెరిగినందున అన్నదాతలు నానో యూరియాపై దృష్టి సారించేలా సహకరించాలన్నారు. వ్యవసాయశాఖ అధికారులు తరచూ ఫెస్టిసైడ్స్ దుకాణాల్లో తనిఖీలు నిర్వహించాలని, నిబంధనలు పాటించని సంబంధిత దుకాణాల డీలర్లపై తగు చర్య లు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం కలెక్టర్ వ్యవసాయశాఖ అధికారులతో ప్ర త్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడు తూ ఫార్మర్ రిజిస్ట్రీలో జోగుళాంబ గద్వాల జిల్లా ప్రస్తుతం 68 శాతంతో రాష్ట్రంలో 28వ స్థానంలో ఉందని, వందశాతం పూర్తి చేసేందుకు ఏఈ వోలు నిబద్ధతతో పనిచేయాలన్నారు. సమావేశంలో జిల్లా వ్యవసాయశాఖ అధికారి వీరప్ప, అదనపు ఎస్పీ శంకర్, అధికారులు ఉన్నారు.