కాంగ్రెస్‌ది.. డైవర్షన్ పాలిటిక్
ABN , Publish Date - Feb 01 , 2026 | 11:36 PM
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని మాజీ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి ఆరోపించారు.
- మాజీ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి
జడ్చర్ల/హన్వాడ/రాజాపూర్/భూత్పూర్/దేవరకద్ర/కోయిలకొండ/మూసాపేట/మహబూబ్‌నగర్ రూరల్/మిడ్జిల్/గండీడ్/మహమ్మదాబాద్, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందని మాజీ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు సిట్ నోటీసులు ఇవ్వడంపై ఆదివారం బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. మాజీ మంత్రి ఆధ్వర్యంలో జడ్చర్ల మునిసిపాలిటీ కావేరమ్మపేట నుంచి క్రాస్‌రోడ్డు, హౌజింగ్ బోర్డు, సిగ్నల్‌గడ్డ, బాదేపల్లి, జడ్చర్లలో నల్ల బ్యాడ్జీలు ధరించి బైకు ర్యాలీ నిర్వహించారు. సీఎం రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేసి, దిష్టిబొమ్మను దహనం చేశారు. మాజీ మంత్రి మాట్లాడుతూ.. కేసీఆర్‌కు సిట్ నోటీసులు జారీ చేసి విచారణకు పిలవడాన్ని ఖండించారు. ఫోన్ ట్యాపింగ్ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామా ఆడుతోందన్నారు. కేటీఆర్, హరీష్‌రావు తర్వాత కేసీఆర్‌ను విచారణ పేరుతో వేధింపులకు గురిచేస్తున్నారని ధ్వజమెత్తారు.
హన్వాడలో మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ నాయకులు గంటపాటు రాస్తారోకో నిర్వహించారు. మండల అధ్యక్షుడు కరుణాకర్‌గౌడ్, మాజీ అధ్యక్షుడు లక్ష్మయ్య, జడ్పీటీసీ మాజీ సభ్యుడు నరేందర్, మాజీ ఎంపీపీ బాలరాజు పాల్గొన్నారు.
రాజాపూర్ మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. మండల అధ్యక్షుడు శ్రీశైలంయాదవ్, సర్పంచ్ శ్రీనునాయక్, బచ్చిరెడ్డి, రమేష్‌నాయక్, సత్యయ్య, అచ్చయ్య, దేవేందర్, వెంకటయ్యగౌడ్, యాదగిరి, రాములు పాల్గొన్నారు.
భూత్పూర్ చౌరస్తాలో బీఆర్‌ఎస్ మండల అధక్షుడు, మునిసిపల్ మాజీ చైర్మన్ బస్వరాజుగౌడ్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. మచ్ఛలేని నాయకుడిపై ఆరోపణలు మోపడం అన్యాయం అన్నారు. బీఆర్‌ఎస్ నాయకుడు మురళిధర్‌గౌడ్, నారాయణగౌడ్, పట్ణణ అధ్యక్షుడు సురేష్‌కుమార్‌గౌడ్, మాజీ వార్డు కౌన్సిలర్ శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎంపీపీ చంద్రశేఖర్‌గౌడ్, రామునాయక్, అన్నాసాగర్ సర్పంచ్ శ్రీకాంత్‌రెడ్డి పాల్గొన్నారు.
దేవరకద్ర మండల కేంద్రంలో మండల అధ్యక్షుడు జెట్టి నరసింహరెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. నాయకులు శ్రీకాంత్‌యాదవ్, నరేందర్‌రెడ్డి, కర్ణంరాజు, ఆంజనేయులు, వెంకట్రాములు పాల్గొన్నారు.
కోయిలకొండ మండల కేంద్రంలోని వివేకానంద చౌరస్తాలో బీఆర్‌ఎస్ నాయకులు రోడ్డుపై బైఠాయించి కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మండల అధ్యక్షుడు కృష్ణయ్య నాయకులు రవి, శ్రీనివాస్‌రెడ్డి, మల్లయ్య, రాజవర్దన్‌రెడ్డి, రాజ్‌కుమార్, కరుణాకర్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.
మూసాపేట, అడ్డాకుల మండల కేంద్రాల్లో బీఆర్‌ఎస్ మండల నాయకులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోల్కంపల్లిలో సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబోమ్మను ఊరేగించి దహనం చేశారు. జడ్పీటీసీ మాజీ సభ్యుడు ఇంద్రయ్యసాగర్, మూసాపేట, అడ్డాకుల బీఆర్‌ఎస్ మండల అధ్యక్షులు లక్ష్మినర్సింహాయాదవ్, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్ రూరల్ మండలం బొక్కలోనిపల్లి గేటు దగ్గర బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు దేవేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించి నిరసన, రాస్తారోకో నిర్వహించారు. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆంజనేయులు, యుగంధర్‌రెడ్డి, రాజవర్ధన్‌రెడ్డి, మల్లికార్జున్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.
మిడ్జిల్ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో బీఆర్‌ఎస్ శ్రేణులు సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. అవసరమైతే ధర్నాలు, ర్యాలీలు నిర్వహించి ప్రభుత్వాన్ని గద్దె దించేవరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
గండీడ్ మండల కేంద్రంతో పాటు వెన్నచేడ్‌లో నల్ల బ్యాడ్జీలు ధరించి బీఆర్‌ఎస్ నాయకులు నిరసన తెలిపారు. తెలంగాణ భవన్‌కు వెళ్తున్న పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డిని వెంటనే విడుదల చేయాలని మహమ్మదాబాద్ మండల కేంద్రం, దేశాయిపల్లిగేట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. జడ్పీటీసీ మాజీ సభ్యుడు శ్రీనివాస్‌రెడ్డి, మండల అధ్యక్షుడు గోపాల్, గోపాల్‌రెడ్డి, మాజీ సర్పంచులు గీతాపాండు, రఘు, నీలేశ్‌నాయక్, కృష్ణగౌడ్ పాల్గొన్నారు.