Share News

రైతుల సమస్యలు పట్టించుకోని ప్రభుత్వం

ABN , Publish Date - May 25 , 2026 | 12:04 AM

రైతు ప్రభు త్వమని చెప్పుకునే ముఖ్యమంత్రి, మంత్రులు, రైతు లను గాలికి వదిలి తమాషా చూస్తున్నారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి కటింగ్‌లు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆదివారం మండల కేంద్రంలో రాస్తా రోకో చేశారు.

రైతుల సమస్యలు పట్టించుకోని ప్రభుత్వం

ధర్మారం, మే 24 (ఆంధ్రజ్యోతి): రైతు ప్రభు త్వమని చెప్పుకునే ముఖ్యమంత్రి, మంత్రులు, రైతు లను గాలికి వదిలి తమాషా చూస్తున్నారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి కటింగ్‌లు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆదివారం మండల కేంద్రంలో రాస్తా రోకో చేశారు. కరీంనగర్‌-రాయపట్నం రహదారిపై ధాన్యాన్ని కుప్పగా పోసి అరగంటపాటు రాస్తారోకో నిర్వహించారు. దాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయా లని నాయకులు, కార్యకర్తలతో కలిసి ఈశ్వర్‌ నినా దాలు చేశారు. రాష్ట్రంలోని అన్ని కొనుగోలు కేంద్రా ల్లో ధాన్యం కుప్పలు తెప్పలుగా పేరుకుపోయిందని, నెల రోజులు గడుస్తున్నా, వర్షాకాలం సమీపిస్తున్న కొనుగోలులో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. క్వింటాల్‌ ధాన్యానికి 7-8 కిలోలు కటింగ్‌ చేస్తున్నా రని, లారీకి 8 నుంచి 9 వేల రూపాయల నష్టం వస్తుందని పేర్కొన్నారు. జిల్లాలోని ఏ కొనుగోలు కేంద్రానికి వస్తావో అదే కొనుగోలు కేంద్రానికే నేను వస్తానని, అక్కడ కటింగ్‌ లేకుండా ధాన్యం కొను గోలు జరుగుతుందో చెప్పాలని కొప్పుల ఈశ్వర్‌ మంత్రి అడ్లూరికి సవాల్‌ విసిరారు.

రీల్స్‌పై ఉన్న శ్రద్ద రైతులపై ఏది..?

మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌కు కార్యకర్తలతో గొప్పలు చెప్పించుకునేందుకు చేసే రీల్స్‌ పై ఉన్న శ్రద్ధ రైతులపై లేదని కొప్పుల ఈశ్వర్‌ ఎద్దేవా చేశా రు. ప్రజలకు ఏం మేలు చేశావని, నియోజకవర్గం లో ఏ గ్రామాన్ని అభివృద్ధి చేశావని నీ కోసం రీల్స్‌ చేయాలని ప్రశ్నించారు. ఇంట్లో ఉండి అంతా బాగుందని చెప్పుకునే నీవు, గ్రామాల్లో తిరిగితే రైతుల కష్టసుఖాలు తెలుస్తాయన్నారు. జగిత్యాలలో స్టడీ సర్కిల్‌ను ప్రారంభించకుండా వేలాది మంది ఎస్సీ విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుం టున్నావని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధర్మపురి టెంపుల్‌తో సహ నియోజక వర్గమంతా అభివృద్ధి కుంటుపడిందని, గతంలో బీఆర్‌ఎస్‌ చేసిన పనులను ఎందుకు కొనసాగించడం లేదని ప్రశ్నిం చారు. ఇప్పటికైనా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, లేదంటే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు.

సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్న బీఆర్‌ ఎస్‌ కార్యకర్తలపై పోలీసులు వందల కేసులు పెట్టా రని తెలిపారు. నియోజకవర్గంలో పోలీసులు చేస్తు న్న అఘాయిత్యాలపై చార్జీషీట్‌ వేస్తామని చెప్పారు. అత్యుత్సాహం ప్రదర్శిస్తున్న పోలీసులను వదిలి పెట్టమని, వేలాది మంది రైతులతో, ప్రజలతో పోలీసులను నిలదీసే రోజు తొందరలోనే ఉందని హెచ్చరించారు. ప్యాక్స్‌ చైర్మన్‌ ముత్యాల బలరాం రెడ్డి, రాచూరి శ్రీధర్‌, గుర్రం మోహన్‌రెడ్డి, తుమ్మల రాంబాబు, ఆవుల శ్రీనివాస్‌, మోతె కనకయ్య, రామరావు, మంద శ్రీనివాస్‌, కూరపాటి శ్రీనివాస్‌, ఆకారి సత్యం, నార ప్రేమ్‌సాగర్‌ పాల్గొన్నారు.

Updated Date - May 25 , 2026 | 12:04 AM