సమర్థవంతంగా మున్సిపల్ ఎన్నికలు
ABN , Publish Date - Feb 04 , 2026 | 12:37 AM
జిల్లా పరిధిలో జరిగే మున్సిపల్ ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ సంఘట నలు జరగకుండా సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర డీజీపీ శశిధర్‌రెడ్డి ఎస్పీని ఆదేశించారు.
సిరిసిల్ల అర్బన్, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): జిల్లా పరిధిలో జరిగే మున్సిపల్ ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ సంఘట నలు జరగకుండా సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర డీజీపీ శశిధర్‌రెడ్డి ఎస్పీని ఆదేశించారు. సిరిసిల్ల జిల్లా పోలీస్ కార్యాలయంలో మంగళవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో హైదరాబాద్ నుంచి రాష్ట్ర డీజీపీ శశిధర్‌రెడ్డి మున్సిపల్ ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ కేంద్రాల వద్ద భఽధ్రత ఏర్పాట్లు, ఎన్నికల చట్టాల, ప్రవర్తన నియమావళి అమలు వంటి అంశాలపై ఎస్పీ మహేష్ బీ గీతేతో సమీక్షించారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రతి పోలీస్ అధికారి ప్రణాళికాబద్ధంగా పని చేయాలని సూచించారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. నామినేషన్ ప్రక్రి య ప్రారంభం నుంచి ఎన్నికలు పూర్తయ్యే వరకు పోలీసులు అప్ర మత్తంగా ఉండి పటిష్టమైన బందోబస్తులను ఏర్పాటు చేయాలన్నారు. గతంలో జరిగిన ఎన్నికల సమయంలో నేరాలకు పాల్పడిన నేరస్తులు ఎన్నికల వేళ నేరాలకు పాల్పడే అవకాశం ఉన్న వ్యక్తులను గుర్తించి పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్‌లు, అనుమానితులను బైండోవర్ చేయాలని ఆదేశించారు. అనంతరం రాష్ట్ర పోలీస్ లీగల్ అడ్వైజర్ ఏపూరి రాములు పోలీసులకు ఎన్నికల నిబంధనలపై సమగ్ర అవగా హన కల్పించారు. ఎన్నికల సమయంలో చట్టాల అమలు నిబంధనలు పాటించడం, ఉల్లంఘనలపై తీసుకోవాల్సిన చర్యలు వంటి అంశాలపై మార్గనిర్దేశనం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మహేష్ బీ గీతే మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సిరిసిల్ల, వేములవాడ మున్సిపాల్టీల పరిధిలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి తీసుకుం టున్న చర్యలతో పాటు ఏర్పాట్లు వివరించారు. ఈ సమీక్షా సమావే శంలో వేములవాడ ఏఎస్పీ రుత్విక్ సాయి, సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్ర చారి, సీఐలు కృష్ణ, వీర ప్రసాద్, స్పెషల్ బ్రాంచ్ రవి, అర్‌ఐలు మధు కర్, యాదగిరి, రమేష్, ఎస్‌ఐలు కిరణ్‌కుమార్, రాంమోహన్, వినితా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.