హైదరాబాద్ నగరంలోని పలు ఆర్టీవో కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు
ABN , Publish Date - May 27 , 2026 | 03:43 PM
హైదరాబాద్ నగరంలోని పలు ఆర్టీవో కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. మేడ్చల్, నాగోల్, కొండాపూర్ ఆర్టీవో కార్యాలయాల్లో పెండింగ్ ఫైళ్లు, డ్రైవింగ్ లైసెన్స్‌లు, వాహనాల రిజిస్ట్రేషన్లలో అక్రమాలపై అధికారులు విచారణ చేపట్టారు.
హైదరాబాద్: నగరంలోని పలు ఆర్టీవో కార్యాలయాల్లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. మేడ్చల్ ఆర్టీవో కార్యాలయం, నాగోల్ ఆర్టీవో కార్యాలయాలతో పాటు కొండాపూర్ ఆర్టీవో కార్యాలయంలో కూడా తనిఖీలు కొనసాగుతున్నాయి.
సుమారు 8 మంది అధికారులతో కూడిన బృందాలు ఏకకాలంలో కార్యాలయాలను తనిఖీ చేస్తున్నాయి. ఆర్టీవో కార్యాలయాల్లో పనిచేస్తున్న కొంతమంది సిబ్బందిపై అవినీతి ఆరోపణలు రావడంతో ఏసీబీ ఈ దాడులు చేపట్టినట్లు సమాచారం. పెండింగ్ ఫైళ్లు, వాహనాల రిజిస్ట్రేషన్లు, డ్రైవింగ్ లైసెన్స్‌ల జారీ ప్రక్రియపై అధికారులు ఆరా తీస్తున్నారు.
అలాగే ఆర్టీఏ ఏజెంట్లు, డ్రైవింగ్ స్కూల్ నిర్వాహకులను కూడా విచారిస్తున్నారు. ఏజెంట్ల ద్వారా డ్రైవింగ్ లైసెన్స్‌లు, ఇతర రిజిస్ట్రేషన్ పనులు అక్రమంగా జరుగుతున్నాయనే సమాచారంతో ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి...
మహానాడు-2026కు శ్రీకారం.. టీడీపీ జెండా ఆవిష్కరించిన చంద్రబాబు
విజన్ పాలిటిక్స్‌కు టీడీపీ నాంది.. మహానాడులో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
Read Latest Telangana News