Share News

గందరగోళం...!

ABN , Publish Date - Jun 09 , 2026 | 11:33 PM

ప్రభుత్వం సాదా బైనామాల సమస్యల పరిష్కారానికి చేస్తున్న కృషి సఫలీ కృతం అవుతుందా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి.

గందరగోళం...!

సాదాబైనామా మార్గదర్శకాల్లో క్లారిటి ఏది...

దరఖాస్తుల పరిష్కారం కష్టతరం...

జిల్లాలో కుప్పలు తెప్పలుగా పెండింగ్‌

పరిష్కారం చూపకుంటే ఇబ్బందికర పరిస్థితులు

మంచిర్యాల, జూన్‌9 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం సాదా బైనామాల సమస్యల పరిష్కారానికి చేస్తున్న కృషి సఫలీ కృతం అవుతుందా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. సాదాబైనామాల దరఖాస్తుల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం తీసుకొచ్చిన గైడ్‌లైన్స్‌ స్పష్టంగా లేకపోవడమే దీనికి కార ణంగా నిలుస్తుంది. దీంతో సాదాబైనామాలను తిరస్కరిం చడమే లక్ష్యంగా అధికారులు పని చేస్తున్నారనే ఆరోపణ లు వినిపిస్తున్నాయి. భూములు విక్రయించడం వల్ల స మ్మతి అవసరం లేదంటూ ప్రభుత్వం జవో జారీ చేసిన వి షయం తెలిసిందే. ఆ తరువాత దానికి సంబంధించిన మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది. అయితే ప్రభు త్వం జారీ చేసిన గైడ్‌లైన్స్‌లో అనేక సందేహాలు ఉండ డంతో తహసీల్దార్‌లు, ఆర్డీవోలు, కలెక్టర్లు సైతం ఒకింత గందరగోళానికి గురవుతున్నట్లు తెలుస్తున్నది. ప్రస్తుత మార్గదర్శకాలకు అనుగుణంగా వచ్చే దరఖాస్తుల్లో కేవలం ఒకటి రెండు శాతం మాత్రమే పరిష్కారానికి నోచుకుం టాయనే చర్చ నడుస్తోంది. సందేహాలను నివృత్తి చేసేలా మార్గదర్శకాల్లో మార్పులు చేపట్టకపోతే దరఖాస్తులు తి రస్కరించడం తప్ప మరోమార్గం లేదనే వ్యాఖ్యలు కూడ వినిపిస్తున్నాయి.

విక్రయదారు పేరు రికార్డుల్లో లేని పక్షంలో...

సాదాబైనామా ద్వారా దశాబ్దాల క్రితం భూమిని కొను గోలు చేసినవారు అనేక మంది ఉన్నారు. 2017లో భూరి కార్డుల ప్రక్షాళన సమయంలో అప్పటి ప్రభుత్వం ఫారం 1బీ జారీ చేయగా పట్టాదారులు చనిపోయిఉంటే వారసు లంతా సక్షేషన్‌ చేయించుకున్నారు కూడ. దానికంటే ముం దు కొందరు విరాసత్‌ సైతం చేయించుకున్నారు. ఇప్పుడు ఆ భూములు వారసుల పేరిట పట్టాలుగా నమోదు అ యి ఉన్నాయి. సాదాబైనామాల్లో భూమి అమ్మిన వ్యక్తి పే రు, రికార్డుల్లో ఉండే అవకాశమే లేదు. అలాంటప్పుడు ద రఖాస్తులు తిరస్కరించమని అధికారులు చెబుతుండ డం ఆందోళనకు దారి తీస్తుంది. ఈ అంశం భూభారతి పోర్టర్‌ లో టెక్నికల్‌గా కూడ సాధ్యం కావడం లేదని తెలుస్తుం ది. వారసులు అభ్యంతరం చేయకపోయిన అమ్మిన వారి పేరు రికార్డుల్లో ఉండదు కాబట్టి సమస్య పరిష్కారానికి అవకాశం లేదనే అభిప్రాయాలు ఉన్నాయి. ఎంజాయ్‌ మెంటు సర్వే, చుట్టు పక్కల రైతులను విచారించి వాస్తవా లను తెలుసుకునే అవకాశం ఉన్నప్పటికీ సాంకేతికంగా ద రఖాస్తు తిరస్కరణకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయంలో ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలు వివ రంగా లేవని సమాచారం.

ఆర్‌ఎస్‌ఆర్‌, సర్వే నెంబర్‌లో పొంతనలేమి...

రెవెన్యూ రికార్డుల ప్రకారం భూమి పెరిగినప్పటికీ ఆర్‌ఎస్‌ఆర్‌, సర్వే నెంబర్లలో పొంతనలేని కారణంగా స మస్య పరిష్కారం కష్టసాధ్యమవుతుందనే అభిప్రాయాలు ఉన్నాయి. భూములు కొనుగోలు చేసిన భూమి ఏ సర్వే నెంబర్‌లో ఉందో, ఆ విస్తీర్ణం సేత్వార్‌కు అనుగుణంగా లేకపోతే ఆర్‌ఎస్‌ఆర్‌ మిస్‌ మ్యాచ్‌ అంటూ అధికారులు రిజెక్ట్‌ చేస్తున్నట్లు తెలుస్తుంది. గిరిజన ప్రాంతాల్లోని భూ ములను ఆవర్గం కొనుగోలు చేసిన సమస్య పరిష్కారాని కి ముందడుగు పడడం లేదు. సాధారణంగా సాదా బైనా మా ద్వారా భూములు కొనుగోలు చేసిన తరువాత ఆ భూమిని మరోవ్యక్తి రిజిష్టర్డ్‌ సేల్డ్‌ డీడ్‌ ద్వారా కొనుగోలు చేసి, మ్యూటేషన్‌ చేసుకుంటే పరిస్థితి ఏమిటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇందులో భూమిపై హక్కులు ఎ వరికి వస్తాయన్న సందేహాలు ఉన్నాయి. దీనిపై సంబం ధిత అధికారులు స్పష్టతనివ్వాల్సిన అవసరం ఉంది.

ఐదెకరాలు మించి ఉంటే...

దరఖాస్తు దారుడి పేరిట ఐదెకరాలపైన భూమి ఉంటే ఆ దరఖాస్తు అంగీకరించాలా లేదా తిరస్కరించాలా అనే సందేహాలు కొందరి అధికారుల్లో ఉన్నాయి. ఈ విషయం లో భూమి కొనుగోలు చేసేటప్పుడు అంత వరకు ఆ వ్యక్తి ఉన్న భూమిని ప్రాతిపదికన తీసుకోవాలా అన్న విషయం మార్గదర్శకాల్లో స్పష్టంగాలేదు. ఐదెకరాల పైగా భూమి ఉ న్న పక్షంలో వాటి దరఖాస్తులను కొందరు అధికారులు తి రస్కరిస్తున్నట్లు తెలుస్తుంది. స్టాంప్‌ డ్యూటి చెల్లిస్తున్న ప్పుడు ఎంత విస్తీర్ణమే అంశానికి ప్రాధాన్యం ఇవ్వడం లే దు. దీంతో మార్గదర్శకాల్లో ఈ అంశంపై స్పష్టత లేదం టూ అధికారులు తిరస్కరిస్తున్నట్లు తెలుస్తుంది.

జిల్లాలో 27వేలపైచిలుకు దరఖాస్తులు...

తెలంగాణ ప్రభుత్వం సాదాబైనామాలతో కొనుగోలు చే సిన భూముల సమస్యలు పరిష్కరించనున్నట్లు ప్రకటిం చడంతో ఆ మేరకు స్థలాలు కొనుగోలు చేసిన వారిలో ఆ శలు చిగురించాయి. దీంతో భూముల క్రమబద్దీకరణకు పె ద్దమొత్తంలో స్పందన వచ్చింది. జిల్లా వ్యాప్తంగా సాదా బై నామాల క్రమబద్దీకరణ కోసం 27140 దరఖాస్తులు అధి కారులకు అందాయి. వాటిలో ఇప్పటి వరకు దాదాపు 10 వేల దరఖాస్తులను సంబంధిత అధికారులు పరిశీలించా రు. వాటికి సంబంధించిన విచారణ కూడ పూర్తయింది. పరిశీలించిన దరఖాస్తుల్లో సింహభాగం తిరస్కరణకు గు రైనట్లు తెలుస్తోంది. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శ కా లు అస్పష్టంగా ఉండడతో అవి క్రమబద్ధీకరణకు నోచు కో వడం లేదని తెలుస్తుంది. కాగా మిగితా దరఖాస్తుల పరి శీలనలో ప్రస్తుతం అధికారులు నిమగ్నమయ్యారు. అ వి పూర్తయితేగాని అన్ని దరఖాస్తులకు క్రమబద్దీకరణ మో క్షం కలుగుతుందో ఎన్ని తిరస్కరణకు గురవుతాయో తె లిసే అవకాశం ఉంది.

Updated Date - Jun 09 , 2026 | 11:33 PM