ఫైనల్‌కు టీమిండియా.. సెమీస్‌లో పోరాడి ఓడిన ఇంగ్లండ్..
ABN , Publish Date - Mar 05 , 2026 | 11:02 PM
టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా ఫైనల్‌కు చేరింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇంగ్లండ్‌తో జరిగిన థ్రిల్లింగ్ సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో గెలుపొందింది. ఏడు పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది. భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఇంగ్లండ్ చివరి ఓవర్ వరకు మ్యాచ్‌లోనే ఉంది.
టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా ఫైనల్‌కు చేరింది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇంగ్లండ్‌తో జరిగిన థ్రిల్లింగ్ సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో గెలుపొందింది. ఏడు పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది. భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఇంగ్లండ్ చివరి ఓవర్ వరకు మ్యాచ్‌లోనే ఉంది. జాకబ్ బెతెల్ (48 బంతుల్లో 105) అద్వితీయ పోరాటం చేశాడు. అయితే చివర్లో ఇంగ్లండ్ ఒత్తిడికి తలవంచింది. దీంతో విజయం సాధించిన టీమిండియా ఆదివారం అహ్మదాబాద్‌లో జరగబోయే ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌తో తలపడనుంది (India vs England semifinal).
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు సంజు శాంసన్ అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు. తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తూ 42 బంతుల్లో 7 సిక్స్‌లు, 8 ఫోర్లతో 89 పరుగులు చేశాడు. అభిషేక్ (9) తప్ప మిగతా బ్యాటర్లు అందరూ దూకుడుగా ఆడి పరుగులు సాధించారు. శివమ్ దూబె (25 బంతుల్లో 43), ఇషాన్ కిషన్ (18 బంతుల్లో 39), హార్దిక్ పాండ్యా (12 బంతుల్లో 27) బౌండరీలతో హోరెత్తించారు. దీంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 253 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో రషీద్, విల్ జాక్స్‌కు రెండేసి వికెట్లు దక్కాయి (India beat England by 7 runs).
254 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఆరంభంలో వికెట్లు కోల్పోయినా బెతెల్ ఓ గుర్తుంచుకోదగిన ఇన్నింగ్స్ ఆడాడు (India reaches T20 World Cup final). టీ20 ప్రపంచకప్‌లోనే రెండో వేగవంతమైన సెంచరీ (45 బంతుల్లో) చేశాడు. అయితే చివరి ఓవర్లో హార్దిక్ విసిరిన అద్బుతమైన త్రోకు రనౌట్ కావడంతో మ్యాచ్ భారత్ వైపు మొగ్గింది. దీంతో ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 246 పరుగులు చేసింది. మొత్తం ఈ మ్యాచ్‌లో 500కు పైగా పరుగులు నమోదయ్యాయి. టీమిండియా బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. హార్దిక్ రెండు వికెట్లు తీశాడు.