Share News

వాలీబాల్‌ లీగ్‌కు అంతర్జాతీయ గుర్తింపు

ABN , Publish Date - Jul 09 , 2026 | 02:20 AM

ప్రైమ్‌ వాలీబాల్‌ లీగ్‌కు తొలి భారత ప్రొఫిషనల్‌ లీగ్‌గా ప్రపంచ వాలీబాల్‌ సమాఖ్య (ఎఫ్‌ఐవీబీ) గుర్తింపు ఇచ్చింది...

వాలీబాల్‌ లీగ్‌కు అంతర్జాతీయ గుర్తింపు

న్యూఢిల్లీ: ప్రైమ్‌ వాలీబాల్‌ లీగ్‌కు తొలి భారత ప్రొఫిషనల్‌ లీగ్‌గా ప్రపంచ వాలీబాల్‌ సమాఖ్య (ఎఫ్‌ఐవీబీ) గుర్తింపు ఇచ్చింది. దీంతో పీవీఎల్‌ జట్లు ఇకపై ఆసియా, ప్రపంచ వాలీబాల్‌ సమాఖ్యలు నిర్వహించే క్లబ్‌ లీగ్‌ల్లో పాల్గొనవచ్చు. వచ్చే నవంబరు 30 నుంచి ఈ లీగ్‌ ఐదో సీజన్‌ను నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఇక, ఆగస్టు 17వ తేదీన గోవాలో ఐదో సీజన్‌ కోసం ఆటగాళ్ల వేలం నిర్వహించనున్నారు.

Updated Date - Jul 09 , 2026 | 02:20 AM