ఫైనల్లో ప్రజ్ఞానంద
ABN , Publish Date - Aug 26 , 2026 | 03:48 AM
భారత టీనేజ్ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద.. గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లాడు. సెమీఫైనల్లో...
సెయింట్ లూయిస్ (యూఎస్): భారత టీనేజ్ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద.. గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లాడు. సెమీఫైనల్లో ప్రజ్ఞానంద 19-9తో విన్సెంట్ కీమర్ (జర్మనీ)ను చిత్తు చేశాడు. టైటిల్ ఫైట్‌లో ఫాబినో కరువానా (అమెరి కా)తో ప్రజ్ఞానంద తలపడ నున్నాడు. రెండు క్లాసిక్ గేమ్స్‌లో 9-3తో పైచేయిగా నిలిచిన ప్రజ్ఞానంద.. రెండు ర్యాపిడ్ గేమ్‌లు గెలిచి 17-3తో తిరుగులేని ఆధిక్యం సాధించాడు. ఇక, బ్లిట్జ్ తొలిగేమ్‌లో గెలిచి మరో రెండు పాయింట్లను ఖాతాలో వేసుకొన్నాడు. అప్పటికే ప్రజ్ఞానంద విజయం ఖరా రైనా.. నిబంధనల ప్రకారం మిగిలిన మూడు ర్యాపిడ్ గేమ్‌లు కూడా ఆడాడు. వీటిల్లో కీమర్ గెలిచాడు. మరో సెమీస్‌లో కరువానా 18-12తో సో వెస్లీపై నెగ్గాడు. కాగా, కీమర్, సో వెస్లీ మూడోస్థానం కోసం పోటీపడనున్నారు. టాప్-3లో నిలిచిన ప్లేయర్లకు వచ్చేఏడాది జరిగే గ్రాండ్ చెస్ టూర్‌లో నేరుగా ఎంట్రీ లభించనుంది.