జ్ఞానేశ్వరి డబుల్ ధమాకా
ABN , Publish Date - May 14 , 2026 | 02:19 AM
ఆసియా సీనియర్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షి్‌పలో చత్తీ్‌సగఢ్ వెయిట్‌లిఫ్టర్ జ్ఞానేశ్వరి యాదవ్ (53కి.) రెండు పతకాలు కొల్లగొట్టింది...
గాంధీనగర్: ఆసియా సీనియర్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షి్‌పలో చత్తీ్‌సగఢ్ వెయిట్‌లిఫ్టర్ జ్ఞానేశ్వరి యాదవ్ (53కి.) రెండు పతకాలు కొల్లగొట్టింది. బుధవారం జరిగిన ఈ పోటీల్లోని స్నాచ్‌లో రజతం, స్నాచ్, క్లీన్ అండ్ జెర్క్‌లో కలిపి మొత్తంగా 194 కి., బరువెత్తి కాంస్యం సాధించింది. జిన్‌లాన్ (చైనా-216కి.) స్వర్ణం, హోయ్ హుయెంగ్ (వియత్నాం-195 కి) రజతం దక్కించుకున్నారు. మరో భారత లిఫ్టర్ కోమల్ కోహర్ (48 కి) కాంస్యం నెగ్గింది. 28 దేశాల నుంచి 178 మందిలిఫ్టర్లు ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. ఈ ఏడాది జరిగే కామన్వెల్త్ క్రీడలకు ఈ చాంపియన్‌షి్‌ప అర్హత పోటీలు కావడం విశేషం.
ఈ వార్తలు కూడా చదవండి
ఎయిర్ ఇండియా సంస్థ కీలక నిర్ణయం.. ఆ మార్గాల్లో విమానాల రద్దు..
నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో సీబీఐ దూకుడు.. ఐదుగురి అరెస్ట్